Bigg Boss 8 Telugu: సెప్టెంబర్ 1న ఆదివారం బిగ్ బాస్ 8 సీజన్ ప్రారంభమైంది. డిసెంబర్ 15న ఆదివారంతో ముగిసింది. దాదాపు 105 రోజులపాటు ఈ షో సాగింది.. సీజన్ 8 లో కర్ణాటక ప్రాంతానికి చెందిన సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ విజేతగా నిలిచాడు. 55 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. తెలుగు నటుడు రామ్ చరణ్ తేజ్ నుంచి అతడు బిగ్ బాస్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ -8 సీజన్ లో మొత్తం 22 మంది పోటీలో పాల్గొన్నారు. ఇందులో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. హోరాహోరీగా సాగిన ఈ సీజన్లో ఫైనల్ పోటీకి వచ్చేసరికి గౌతమ్, నిఖిల్, నబిల్, అవినాష్ మాత్రమే మిగిలారు. టాప్ 5 లో నిలిచారు. నిఖిల్, గౌతమ్ ఫైనల్ లో ట్రోఫీ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. చివరికి నిఖిల్ విజేతగా నిలిచాడు. 55 లక్షల నగదు బహుమతితో పాటు మారుతి సుజుకి కారు గెలుచుకున్నాడు.. నిఖిల్ కన్నడ నటుడు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతానికి చెందినవాడు. గోరింటాకు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. అందులో పార్ధు పాత్ర ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు.
పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ తో..
పల్లవి ప్రశాంత్ గత సీజన్లో విజేతగా నిలిచాడు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో వద్ద వివాదం. వేలాది మందిగా యువకులు అక్కడికి వచ్చి ర్యాలీ నిర్వహించడానికి ఇప్పించారు. ట్రోఫీ అందుకున్న కొద్దిసేపటికి పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు ఆ ర్యాలీ వల్ల హైదరాబాద్ నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో హైదరాబాద్ ప్రజలు నరకం చూశారు. దీంతో పోలీసులకు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం తీర ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి అటువంటి పరిణామం చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏకంగా 300 మంది పోలీసులు రంగంలోకి దిగి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద భారీగా వ్యవహరించారు. అన్నపూర్ణ స్టూడియో వెళ్లే దారులను బారికేడ్ల తో మూసివేశారు. ఊరేగింపుకు ఎటువంటి అనుమతి ఇవ్వకుండా.. సైలెంట్ గా వెళ్ళిపొమ్మని సూచించారు. పోలీసులు చెప్పినట్టుగానే నిఖిల్ సైలెంట్ గా తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. మొత్తం మీద పోలీసులు పకడ్బందీ ప్రణాళిక అమలు చేయడంతో ఎటువంటి గొడవలు.. ఇబ్బందులు చోటు చేసుకోలేదు. దీంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచే తెలంగాణ పోలీసులు అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా మోహరించారు. విజేత ప్రకటన వెలువడిన తర్వాత ఒక్కసారి గా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరవాసులను అటువైపు రాకుండా అడ్డుకున్నారు. ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాలలో ముందుగానే హైదరాబాదు నగర వాసులకు సమాచారం అందించారు. బోర్డుల వద్ద కూడా ఈ సమాచారాన్ని పొందుపరిచారు. ఫలితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బిగ్ బాస్ ఫైనల్ ప్రహసనం ముగిసింది.