Bigg Boss Telugu 8: మణికంఠ లో ఈ వారం చాలా మార్పు వచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాగార్జున మరియు తోటి హౌస్ మేట్స్ గత వీకెండ్ లో ఇచ్చిన ఫుల్ కోటింగ్ మణికంఠ గేమ్ కి బాగా ఉపయోగపడింది అని చెప్పొచ్చు. ప్రతీ వారం గెలికి మరీ తన స్నేహితులతో గొడవలు పెట్టుకొని బోలెడంత సానుభూతి పొందేవాడు మణికంఠ. కానీ ఈ వారం మాత్రం అలాంటివేమీ చేయలేదు. అలవాటు అయిన కంటెస్టెంట్స్ తోనే ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇక వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లోపలకు వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తాడో అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా ఏమి జరగలేదు. అందరితో మణికంఠ చాలా తొందరగా కలిసిపోయాడు. అయితే మణికంఠ లో ఎన్ని నెగటివ్ లక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని మెచ్చుకోదగినవి ఉన్నాయి.
ఫిజికల్ గా మణికంఠ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే చాలా బలహీనం అని చెప్పొచ్చు. కానీ టాస్కులు ఆడే విషయం లో మాత్రం ఇతనికి ఉన్నంత కసి హౌస్ లో ఏ కంటెస్టెంట్ కి లేదనే చెప్పాలి. తన నుండి ఎంత బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలో, అంతకు మించే ఇస్తాడు మణికంఠ. అందుకే ఈ వారం ఆయన ఆడిన ప్రతీ టాస్కులోనూ బాగా షైన్ అయ్యాడు. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో అయితే ఆయన నిఖిల్ తో పోటీ పడుతూ టాస్కులు ఆడాడు. చివరి వరకు నిఖిల్ కి పోటీని ఇచ్చి ఓడిపోయాడు. ఇది చూసేందుకు చాలా బాగా అనిపించింది. మనిషిలో ఇలా గెలవాలి అనే తపన ఉండాలి అనే లక్షణం ని మణికంఠ లో చూసి చాలా మంది నేర్చుకోవచ్చు. ఇక మణికంఠ తర్వాత జనాల మెప్పు పొందిన మరో కంటెస్టెంట్ యష్మీ. ఈ వారం ఈమెకి హౌస్ లో అత్యధిక నామినేషన్స్ వచ్చాయి. కానీ డ్రామాలు చేయకుండా చిరునవ్వుతో వాటిని స్వీకరించింది. అలాగే హోటల్ టాస్క్ లో ఈమె ఇచ్చిన పెర్ఫార్మన్స్ నెంబర్ 1 మరియు ది బెస్ట్ అని చెప్పొచ్చు.
ప్రతీ సందర్భంలోనూ ఆమె కలగచేసుకొని కామెడీ ని పండించిన తీరు అదుర్స్ అనే చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పెరఫార్మెర్ ఆఫ్ ది వీక్ ట్యాగ్ యష్మీ కి ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవ్వాలి అదే న్యాయం అని అంటున్నారు నెటిజెన్స్. ఇలా ఈ వారం యష్మీ, మణికంఠ, అవినాష్, రోహిణి, హరితేజ లేకపోతే టాస్క్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది అని చెప్పొచ్చు. మిగిలిన కంటెస్టెంట్స్ ఈ టాస్క్ లో ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే అనే భావన చూసే ఆడియన్స్ కి అనిపించింది. ఇక విష్ణు ప్రియ గ్రాఫ్ అయితే ఈ వారం పాతాళ లోకం లోకి పడిపోయింది అని చెప్పొచ్చు. టాప్ 5 కి వెళ్లే సంగతి కాసేపు పక్కన పెడితే, ఈమె మరో రెండు వారాల్లో నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఎలిమినేట్ అవ్వకుండా ఉండడమే ఎక్కువ అని అంటున్నారు నెటిజెన్స్.