Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సిద్ధ యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా తుల, మిథునం రాశుల వారు ఆర్థికంగా పుంజుకుంటారు. మరికొన్ని రాశుల వారు సమ్యలు కొని తెచ్చుకుంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఆర్థికంగా ఈ రాశి వారు ఈరోజు పుంజుకుంటారు. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతృప్తినిస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఉంటాయి.
వృషభ రాశి:
ఈరాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు ఉండకపోవచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సున్నిత విషయాలపై జాగ్రత్తగా స్పందించాలి. మిమ్మల్ని కొంతమంది ఇబ్బందులకు గురిచేసే అవకాశం.
మిథున రాశి:
కొన్ని పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకుంటారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. సాయంత్రం స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి:
శుభకార్యాలయాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. విద్యార్థుల గురించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.
సింహారాశి:
అదనపు పనిభారం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి:
పాత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు పొందే అవకాశం.
తుల రాశి:
ఆర్థికంగా పుంజుకుంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ధన సాయం అందుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఏదైనా పని ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవాలి.
వృశ్చిక రాశి:
కుటుంబ సభ్యుల మద్దతు వ్యాపారులకు ఉంటుంది. ఉద్యోగులు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్యం కోసం కష్టపడి పనిచేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి:
కొన్ని రంగాల వారు బిజీగా ఉంటారు. ముఖ్యమైన పనులు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. బంధువులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
కుంభరాశి:
కొన్ని కారణాల వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతికూల పరిస్థితులు ఎదరయ్యే అవకాశం. కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయాన్ని వాయిదా వేసుకోవాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీనరాశి:
సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. పరువు నష్టం ఉండే అవకాశం. వాగ్దానాలు నెరవేర్చడంలో బిజీగా ఉంటారు. ఇతరుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.