Allu Arjun: ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు.. ‘మెగా’ వార్‌కు ముగింపు.. ఒక్క ట్వీట్‌తో అల్లు అర్జున్‌ సంచలనం…!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు మధ్య మొదలైన వార్‌.. తర్వాత కూడా కొనసాగుతూ వచ్చింది. ఈ యుద్ధానికి ఆజ్యం పోసేలా ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి అల్లు అర్జున్‌ కూడా నాను నచ్చితే ఎక్కడికైనా వెళ్తా అని కౌంటర్‌ ఇచ్చారు.

Written By: Raj Shekar, Updated On : September 3, 2024 8:17 am

Allu Arjun(7)

Follow us on

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు.. హీరోలు, హీరోయిన్ల మధ్య గొడవలు సాధారణం. గతంలో మోహన్‌బాబు, చిరంజీవి మధ్య, అంతకు ముందు చిరంజీవి, విజయశాంతి మధ్య.. గొడవలు జరిగాయి. మా ఎన్నికల సమయంలోనూ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోతోంది. కొందరు ఒకవర్గానికి, కొందరు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ పెద్ద హీరోలు, నిర్మాతలే వెనుకుండి చక్రం తిప్పుతున్నారు. ఇవన్నీ వేర్వేరు కుటుంబాల మధ్య జరిగేవి. కానీ, ఆరు నెలలుగా ఇండస్ట్రీకి చెందిన ఒకే కుటుంబం.. అదీ బడా కుటుంబం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్లు.. ఇప్పుడు ఆధిపత్య పోరుతు ఇంటి గుట్టు రట్టు చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల మద్దతు విషయంలో మొదలైన విభేతాలు.. తర్వాత సినిమాల వరకూ వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న టెన్షన్‌ ఇండస్ట్రీలోనూ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ ‘మెగా’ వార్‌కు ముగింపు పలికాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. తన బ్రాండ్‌ ఏంటో ఒక్క ట్వీట్‌లో చూపించాడు.

సోషల్‌ మీడియా వేదికగా..
మెగా వార్‌కు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముగింపు పలికారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘పవర్‌ స్టార్‌ అండ్‌ డీసీఎంకి మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే ః పవన్‌ కళ్యాణ్‌ గారు’ అంటూ అల్లు అర్జున్‌ తన సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌ డే విషెష్‌ తెలిపారు. ఆగస్టు 22న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు నాడు కూడా అల్లు అర్జున్‌ విషెష్‌ తెలిపారు. దీంతో మెగా వర్సెస్‌ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెర పడినట్టే అని అభిమానులు భావిస్తున్నారు.

ఎన్నికల సమయంలో లొల్లి..
ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్‌ కల్యాణ్‌కు అండగా నిలిస్తే.. ఒక్క అల్లు అర్జున్‌ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్‌ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్‌ ఒక్కసారిగా టార్గెట్‌ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్‌ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపించింది. ఇక మెగా వర్సెస్‌ అల్లు అభిమానుల మధ్య అయితే వార్‌ తారస్థాయికి చేరుకుంది. సోషల్‌ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు.

స్టైలిష్‌ స్టార్‌పై కీలక వ్యాఖ్యలు
నాగబాబు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేయడం, పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా అల్లు అర్జున్‌ గురించి మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప–2 సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు. వీరికి కౌంటర్‌గా అల్లు అర్జున్‌ ..నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అది మీ అందరికీ తెలుసంటూ కామెంట్‌ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే తాజాగా ఈ వార్‌కు అల్లు అర్జున్‌ ముగింపు పలికారు. ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్‌ పవన్‌ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఈ యుద్దాన్ని ఇంతటితో ఆపుతారో లేదో చూడాలి.