Viral fevar : భయపెట్టిస్తున్న వైరల్ ఫివర్.. రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

చాలా మంది వైరల్ ఫివర్స్ తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ ఫివర్ రాకుండా ఉండాలంటే ముందు చిన్న చిట్కాలు పాటించాలి. అప్పుడే వైరల్ ఫివర్స్ ని ఆరికట్టవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఈరోజు మన స్టోరీ లో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : September 2, 2024 10:02 pm

Viral Fewer

Follow us on

Viral fevar :  ప్రస్తుతం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. అసలు గ్యాప్ లేకుండా కంటిన్యూ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఈ వర్షాలు మొదలైన వెంటనే.. చాలా మంది అనారోగ్య బారిన పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు కూడా జ్వరాల బారిన పడుతున్నారు. మరి ముఖ్యంగా వైరల్ ఫివర్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఫివర్ వస్తే.. ఇక అంతే సంగతి. ఆసుపత్రి చుట్టూ తిరగాలసిందే. చిన్నగా దగ్గు, జలుబు, జ్వరం స్టార్ట్ అయ్యి.. అది కాస్త పెద్దది అవుతుంది. బాడీ లో ఈ చిన్న లక్షణాలు కనిపించిన జాగ్రత్తలు తీసుకోకుండా.. ఏం కాదని పట్టించుకోరు. తీరా చివరికి పెద్దది అవుతుంది. ఇలా చాలా మంది వైరల్ ఫివర్స్ తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ ఫివర్ రాకుండా ఉండాలంటే ముందు చిన్న చిట్కాలు పాటించాలి. అప్పుడే వైరల్ ఫివర్స్ ని ఆరికట్టవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఈరోజు మన స్టోరీ లో తెలుసుకుందాం.

ఏ కాలమైన కొందరికి జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తుంటాయి. కాబట్టి వీటిని తగ్గించుకోవాలంటే.. పరిశుభ్రత అనేది తప్పనిసరి. చాలా మంది అసలు చేతులు అవి శుభ్రం చేసుకోరు. దీని వల్ల బాక్టీరియా ఉండిపోయి.. ఫివర్ కి కారణం అవుతుంది. కాబట్టి బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి, రెస్ట్ రూమ్ కి వెళ్లిన ప్రతిసారి కూడా హాండ్స్ శుభ్రం చేసుకోవాలి. అప్పుడే ఫివర్ రాకుండా ఆరికట్టగలం. చాలా మందికి ఇమ్మ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. బాడీ లో రోగ నిరోధక శక్తి లేకపోతే తొందరగా ఫివర్ వస్తుంది. కాబట్టి ఫుడ్ సరిగ్గా తింటూ.. ఫుల్ గా నిద్రపోవాలి. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగేలా ఆహారం తీసుకోవాలి. రోజు వ్యాయామం, యోగా, మేడిటేషన్ వంటివి చేయాలి. జ్వరం వచ్చిన వాళ్లకు దూరంగా ఉండండి. వాళ్లు ఉపయోగించిన టవల్, సోప్ వంటివి వాడవద్దు. ఏ చిన్న లక్షణం కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఈ వైరల్ ఫివర్ ఎక్కువగా దోమలు వల్ల వస్తుంది. కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో దోమ తెరలు వాడాలి. ఇంట్లో వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి. ఈ కాలంలో వేడి నీరు తాగడం చాలా మంచిది. చాలా మందికి అసలు వేడి నీరు అంటే నచ్చదు. అలా అని చల్లని ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారు. ఈ వాటర్ తాగడం వల్ల జలుబు, దగ్గు పెరిగి ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే ఫీవర్ వచ్చి.. అది కాస్త పెరిగి మలేరియా, డెంగీకి కారణామవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.