https://oktelugu.com/

Horoscope Today: ఈ రెండు రాశుల వారికి ఈరోజు అదనపు ఆదాయం..

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల ద్వారా ఆశించిన ఫలితాలు పొందుతారు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 / 08:17 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల్లోని మార్పుల కారణంగా కన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. మంగళవారం ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో సింహాం, మిథున రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది.

    మేష రాశి:
    కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతో పనిచేస్తారు. కొన్ని కార్యక్రమాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    వృషభ రాశి:
    బంధువుల నుంచి ధన సాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొన్ని ఇబ్బందికరమైన వార్తలు వింటారు. విద్యార్థుల భవిష్యత్ పై పెట్టుబడులు పెడుతారు.

    మిథున రాశి:
    ఉద్యోగులు అనుకోకుండా భారీ ప్రయోజనాలు పొందుతారు. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి.

    కర్కాటక రాశి:
    కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల ద్వారా ఆశించిన ఫలితాలు పొందుతారు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    సింహారాశి:
    పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. కొందరు శత్రవుల కారణంగా వ్యాపారులునష్టపోతారు.

    కన్య రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదైనా పని మొదలు పెడితే కచ్చితంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. కుటుంబ సభ్యుల సలహాతో కొత్త ప్రాజెక్టులు చేపడుతారు.

    తుల రాశి:
    ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలో వ్యాపారులు కొన్ని రంగాల్లో దూసుకుపోతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

    వృశ్చిక రాశి:
    కొన్ని సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆదాయం పెరుగుతుంది. కొత్ వ్యక్తులు పరిచయం అవుతారు.

    ధనస్సు రాశి:
    వ్యాపారంలో కొన్ని రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే శత్రువుల నుంచి దాడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇతరులకు అప్పుగా ఇచ్చే సమయంలో ఆలోచించాలి. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు.

    మకర రాశి:
    వరుసగా శుభవార్తలు వింటారు.దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేరస్తారు. కొన్ని సమావేశాలు లాభాలను తెచ్చిపెడుతాయి. ప్రసంగాలను అదుపులో ఉంచుకోవాలి.

    కుంభరాశి:
    ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దగ్గరి వారే మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి గౌరవం పొందుతారు.జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు.

    మీనరాశి:
    వివాదాలకు దూరంగా ఉండాలి. కటుంబ సభ్యుల కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త పనిని మొదలు పెట్టేముందు కుటుంబ సభ్యులతో చర్చించాలి.