https://oktelugu.com/

Horoscope Today:ఈ రాశుల వారికి ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు..

ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం.

Written By:
  • Srinivas
  • , Updated On : January 11, 2025 / 09:04 AM IST

    Horoscope Today(13)

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై రోహిణి, మృగశిర నక్షత్రల ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సర్వార్ద సిద్ధియోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వివాహ ప్రతిపాదనలు వస్ాయి. వ్యాపారులు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబసభ్యుల మద్దతుతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇంటికి అతిథి రావడంతో సందడిగా ఉంటుంది. అనుకోకుండా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రియమైన వారి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారులు కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : బకాయిలు వసూలవుతాయి. ఏదైనా పనిని ప్రారంభిస్తే ఈరోజుతో పూర్తి చేస్తారు. వైద్యరంగంలోని వారికి అనుకున్న ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెల్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : పిల్లల భవిష్యత్ కోసం కొత్త పెట్టుబుడులు పెడుతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడాలి.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : రాజకీయ రంగాల వారికి అనుకూలం. కొన్ని సమావేశాలు వీరికి లాభిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. దీంతో వీరు అన్యోన్యంగా ఉంటారు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారులు కష్టపడాల్సి వస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఇంట్లో వాళ్ల కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగులు బిజ షెడ్యూల్ లో గడుపుతారు.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఖర్చుల విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడుతారు.