Upasana: ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్(Ram Charan) నుండి వస్తున్న సోలో మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). ఆయన గత రెండు చిత్రాలు మల్టీస్టారర్స్ అని చెప్పొచ్చు. ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ హీరో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య చేశారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేశాడని చెప్పొచ్చు. రాజమౌళి సెంటిమెంట్ కి ఆచార్య కూడా బలి అయ్యింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేతులు కలిపారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ తెరకెక్కించారు. శంకర్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ గేమ్ ఛేంజర్. శంకర్ మార్క్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కింది. వివాదాలతో మధ్యలో ఆగిపోయిన భారతీయుడు 2 చిత్రాన్ని శంకర్ తిరిగి పూర్తి చేయాల్సి వచ్చింది. దానితో షూటింగ్ మధ్యలో ఉన్న గేమ్ ఛేంజర్ ని కొన్నాళ్ళు ఆయన పక్కన పెట్టారు. ఈ కారణంగా గేమ్ ఛేంజర్ విడుదల ఆలస్యమైంది.
విశ్వంభర మూవీ సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడంతో డిసెంబర్ కి విడుదల కావాల్సిన గేమ్ ఛేంజర్ ని జనవరికి షిఫ్ట్ చేశారు. 10న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో గేమ్ ఛేంజర్ విడుదలైంది. గ్రాండ్ విజువల్స్ తో శంకర్ కొంత మేర మెప్పించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్నగా రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు కొనియాడుతున్నారు. మొత్తంగా సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. రొటీన్ కథ కథనాలు, ఎమోషనల్ గా మూవీ కనెక్ట్ కాలేదని అంటున్నారు. శంకర్ మార్క్ మిస్ అయ్యిందనేది ఆడియన్స్ అభిప్రాయం.
కాగా గేమ్ ఛేంజర్ మూవీ చూసిన ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వివిధ మీడియా సంస్థలు గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ నటనను కొనియాడుతూ రాసిన వాక్యాలను ఆమె షేర్ చేశారు. అలాగే కంగ్రాట్స్ హస్బెండ్.. అంటూ క్యూట్ అండ్ రొమాంటిక్ గా శుభాకాంక్షలు తెలియజేసింది. ఉపాసన కామెంట్ వైరల్ అవుతుంది.
Congratulations my dearest husband @AlwaysRamCharan
You truly are a game changer in every way.
Love u ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/qU6v54rRbh— Upasana Konidela (@upasanakonidela) January 10, 2025