https://oktelugu.com/

Ram Charan : అమ్మాయిలలో రామ్ చరణ్ క్రేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..’గేమ్ చేంజర్’ థియేటర్ వద్ద ఎలా డ్యాన్స్ వేసారో చూడండి!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 11, 2025 / 09:38 AM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ పోషించిన అప్పన్న క్యారక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ మిగతా సినిమా మొత్తం ఊహించిన రేంజ్ లో ఉండకపోవడం వల్లే ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. కానీ సంక్రాంతి సెలవులు కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా తెలుగు లో వచ్చిన టాక్ కంటే హిందీ, తమిళం లో వచ్చిన టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. అక్కడ ఓపెనింగ్ వసూళ్లు భారీగానే వచ్చాయి. కేవలం హిందీ నుండి ఈ చిత్రానికి మొదటి రోజు 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన సంబరాలు వేరే లెవెల్లో ఉన్నాయి అని చెప్పొచ్చు. అనేక ప్రాంతాలలో అభిమానులు చేసిన సంబరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అనంతపురం లోని ఒక థియేటర్ లో అమ్మాయిలు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ చిత్రం లోని ‘రా మచ్చ మచ్చ’ పాటకు దుమ్ము లేచిపోయే రేంజ్ లో స్టెప్పులు వేశారు. దీనిని ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో అభిమానులు తెగ షేర్ చేసేస్తున్నారు. ఈ చిత్రం విడుదలైన ప్రతీ సెంటర్ లోనూ అభిమానులు భారీ కటౌట్స్ ని ఏర్పాటు చేసారు. బెంగళూరు లోని బృంద థియేటర్ లో రామ్ చరణ్ కి సంబంధించి ఏకంగా 15 కటౌట్స్ ఏర్పాటు చేసారు. ఇలా ఒక్కటా రెండా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం ని తలపించారు అభిమానులు.

    తమిళనాడు లో రామ్ చరణ్ కి ఇంతమంది అభిమానులు ఉన్నారని ఈరోజు తెలిసిందే. వాళ్ళ నుండి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ మామూలుది కాదు. రామ్ చరణ్ నటనకు ఫిదా అయిపోయారు. కేవలం ఒక్క తెలుగు లోనే అంచనాలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల డివైడ్ టాక్ వచ్చినట్టు ఉందని విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అప్పన్న క్యారక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్ లాంటి మాస్ హీరో కి భారీ లెవెల్ ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్ పెట్టకపోవడం చాలా పెద్ద మైనస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ సన్నివేశాలను తొలగించి, కేవలం పొలిటికల్ డ్రామా మీద ఫోకస్ చేసి ఉంటే టాక్ వేరేలా ఉండేది. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏమేర రాణించగలదు అనేది. ‘దేవర’ లాగా నెగటివ్ టాక్ ని ఛేదించి, ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి.