Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh new release date: చెప్పిన తేదీ కంటే ముందే రాబోతున్న 'ఉస్తాద్...

Ustaad Bhagat Singh new release date: చెప్పిన తేదీ కంటే ముందే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’..కొత్త విడుదల తేదీ ఏంటంటే!

Ustaad Bhagat Singh new release date: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు పండుగ వారం రోజుల ముందే రాబోతుంది. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)’ మూవీ ని ఈ నెల 26 న విడుదల చేయబోతున్నాము అంటూ మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తేదీన విడుదల అవ్వడం లేదు. మార్చి 19 న ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ . అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. పని పూర్తి అవ్వడం కోసం దేవిశ్రీ ప్రసాద్ ని ఈ సినిమా నుండి తప్పించి, తమన్ ని పెట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ మొత్తం ఇప్పుడు తమన్ చేయబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ డైరెక్టర్ కి సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోవడం , తమన్ వేగంగా మంచి ఔట్పుట్ ఇస్తాడు కాబట్టి ఆయన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.

మార్చి 10 లోపు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ తో పాటు, రీ రికార్డింగ్ వర్క్ కూడా పూర్తి చేయబోతున్నారట మేకర్స్. గత వారం రోజుల నుండి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రైలర్ కట్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కొడుతున్నాడట తమన్. మార్చి 19 న విడుదల చెయ్యాలనే ఆలోచనకు రావడానికి కారణం ‘టాక్సిక్ ‘ చిత్రం వాయిదా పడడం వల్లే. అంతే కాకుండా ‘ధురంధర్ 2 ‘ చిత్రం కూడా వాయిదా పడుతుంది అనే వార్తలు రావడం తో , ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రాన్ని మార్చి 19 కి లాక్ చేసారాని టాక్. ఈరోజు సాయంత్రం , లేదా రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ‘ధురంధర్ 2 ‘ వాయిదా పడితే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి.

Also Read: నా ఆస్తులు అమ్ముకుని నీ అప్పులు తీర్చుకో!.. పూరి కోసం స్టార్ డైరెక్టర్ గొప్ప మనసు…

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఓజీ రికార్డుని బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు . మార్చి 19 న ఉగాది, 20 న రంజాన్ , 27 న శ్రీ రామ నవమి , మార్చి మొదటి వారం లో గుడ్ ఫ్రైడే. సంక్రాంతి తర్వాత ఈ ఏడాది ది బెస్ట్ డేట్ ఇదే . కేవలం ఓపెనింగ్స్ లో మాత్రమే కాదు, క్లోజింగ్ లో కూడా ఈ చిత్రం ఓజీ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. కాసేపటి క్రితమే డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించి ఒక ట్వీట్ వేస్తూ , ఇక నుండి అప్డేట్స్ దడ దడ పిడుగులు పడినట్టు గా వస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version