https://oktelugu.com/

Horoscope Today: రవి యోగం కారణంగా ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. ఆ రాశుల వారు జాగ్రత్త..

భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు చేపడతారు. చట్ట పరమైన వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : December 4, 2024 / 07:56 AM IST

    Horoscope Today(7)

    Follow us on

    Horoscope Today: ఈరోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు రవి యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు వారు ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం..

    మేష రాశి: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.

    వృషభ రాశి: భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు చేపడతారు. చట్ట పరమైన వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    మిథున రాశి: కుటుంబంలో ఒకరికి అనారోగ్యం ఉంటుంది. కొన్ని పనులు ఇష్టంగా ఉంటేనే చేయండి. అనవసర వివాదాల జోలికి పోవద్దు. ఖర్చులు పెరుగుతాయి .కొత్త వ్యక్తులతో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.

    కర్కాటక రాశి: ఇంట్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి సోదరుల సహకారం తీసుకుంటారు. మీ మాటల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు.

    సింహారాశి: వ్యాపారులకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగులు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఉన్నతాధికారి నుంచి ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విద్యార్థులు విజయం సాధిస్తారు.

    కన్య రాశి: అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలనుకునే వారికి ఈరోజు అనుకూలం. కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యమైన కార్యక్రమం గురించి చర్చిస్తారు. వ్యాపారాలు కొత్త ఒప్పందాలను పరుచుకుంటారు.

    తుల రాశి: సీనియర్ అధికారి మద్దతుతో ఉద్యోగులు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్ కు సంబంధించి కొత్త ప్రాజెక్టుల కోసం ప్లాన్ చేస్తారు.

    వృశ్చిక రాశి: ఈరోజు కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు అనుకోని కొని ధన ప్రయోజనాలు ఉంటాయి. పాత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి .స్నేహితులతో సరదాగా ఉంటారు.

    ధనస్సు రాశి: వ్యాపారులకు సోదరుల పూర్తి మద్దతు ఉంటుంది. కొన్ని రిస్క్ తో కూడుకున్న పనులు చేస్తారు. వీటివల్ల ప్రయోజనాలు ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

    మకర రాశి: ఉద్యోగులు కొన్ని రకాల ఒత్తిడిలను ఎదుర్కొంటారు. అంతే నిజాయితీగా పనులు చేయడం వలన ప్రశంసలు వస్తాయి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

    కుంభరాశి: వ్యాపారులు కొత్త పెట్టుబడి పెట్టే వారికి ఈ రోజు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారమే తీర్చుకోవాలి. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి: ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. వ్యాపారాలు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు.