coconut : కొబ్బరినీళ్లతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని అన్ని కాలాల కంటే ఎండాకాలంలో ఎక్కువగా వినియోగిస్తారు. వర్షాకాలం, చలికాలంలో కొబ్బరినీరు తాగడం ఇష్టం ఉండదు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకే.. ఎక్కువగా మంచినీళ్లు, జ్యూస్ లు తాగుతుంటారు. దీని వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. అందుకే.. వేసవిలో జ్యూసీ ఫ్రూట్స్, కొబ్బరినీళ్లు తాగుతారు. మరి ఈ చలికాలంలో ఏం చేయాలి? అనుకుంటున్నారా? వాటర్ తాగాలన్నా కూడా ఇష్టం ఉండదు. మరి కొబ్బరి నీళ్లు తాగితే ఎలా ఉంటుంది. ప్రయోజనాలు మెండే కానీ తాగవచ్చా? లేదా అనుకుంటున్నారా? ఓ సారి చలికాలంలో కొబ్బరినీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసేద్దామా?
కొబ్బరి నీరు అత్యంత పోషకమైనది. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలతో నిండిన సహజమైన, తక్కువ కేలరీల పానీయం. చలికాలంలో కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి అవేంటో పూర్తిగా తెలుసుకుందాం. కొబ్బరి నీరు ఆర్ద్రీకరణను పెంచుతుంది. కొబ్బరి నీరు అనేది సహజమైన ఎలక్ట్రోలైట్ పానీయం, ఇది మనకు దాహం అనిపించనప్పుడు శీతాకాలంలో కూడా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండటం వలన, చక్కెర పానీయాలకు కొబ్బరి నీరు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉంటుంది. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియకు తోడ్పడే బయోయాక్టివ్ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. మలబద్ధకం, ఉబ్బరం వంటి శీతాకాలపు సాధారణ ఫిర్యాదులను నివారిస్తుంది. రోగనిరోధక శక్తి బూస్టర్ గా పనిచేస్తుంది. విటమిన్ సి, కొబ్బరిలోని మెగ్నీషియం జలుబు, ఫ్లూ వంటి చలికాలపు వ్యాధులను ఎదుర్కోవడానికి శరీరానికి సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. ఇందులోని హైడ్రేటింగ్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని తేమగా, మెరుస్తూ ఉంచడంలో సహాయపడతాయి. చలికాలపు గాలి వల్ల కలిగే పొడిబారడం, పొట్టు వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది కొబ్బరినీరు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణకు మద్దతు ఇస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఈ కొబ్బరినీరు. చలికాలంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి ఉపయోగపడే ఈ కొబ్బరినీరు వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగు అవుతుంది.
కొబ్బరి నీరు డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. ఈ నీటిలో కేలరీలు తక్కువగా ఉండి సహజ ఎంజైములు.. పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరినీరులో పొటాషియం ఉంటుంది. అంతేకాకుండా, ఇది విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, వంటి పోషకాలను కలిగి ఉంటుంది. కొబ్బరినీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లను వెంటనే అందించడానికి పని చేస్తుంది. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.