Chiranjeevi and Srikanth Odela : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే దర్శకుల విషయానికి వస్తే యంగ్ డైరెక్టర్స్ మాత్రం పెను ప్రభంజనాలను సృష్టిస్తూ స్టార్ హీరోలతో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్ళకంటు ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలంటే మాత్రం తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ హవా కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా లో వాళ్లని మించిన దర్శకులు లేరు అనే అంతలా గుర్తింపును సంపాదించుకుంటూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక దసరా సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెల తనదైన రీతిలో సత్తా చాటుతూ భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన నాని ని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న నేపధ్యంలో ఆయన రీసెంట్ గా చిరంజీవిని కలిసి ఒక కథ కూడా వినిపించినట్టుగా వార్తలైతే వచ్చాయి. ఇక దానికి ఈ మాత్రం తీసిపోకుండా కొద్దిసేపటి క్రితమే శ్రీకాంత్ ఓదెల చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ ఒక పోస్టర్ నైతే రిలీజ్ చేశారు. మాస్ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న శ్రీకాంత్ ఓదెల చిరంజీవితో చేయబోతున్న సినిమా కూడా మాస్ సినిమాగా ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక చిరంజీవి చేతిని చూపిస్తూ దానికి బ్లడ్ ఉన్న ఒక పిక్ నైతే రిలీజ్ చేశారు. ఇక దాంతో పాటుగా నాని కూడా చిరంజీవిని చూస్తూ పెరిగాను అంటూ ఒక ట్వీట్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి, నాని ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఈ సినిమా తనకి ఒక బెస్ట్ అవకాశమనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు నానితో సినిమాలు చేసిన ఆయన తన మూడో సినిమాగా చిరంజీవితో సినిమా చేసి సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన దశ తిరిగినట్టే ఇప్పటికే ఆయన చేస్తున్న ప్యారడైజ్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికి చిరంజీవితో సినిమా అనౌన్స్ అవ్వడంతో నాని ప్రాజెక్టు మీద కూడా చాలా వరకు అంచనాలైతే పెరుగుతున్నాయి.
ఇక దాంతో పాటుగా చిరంజీవితో చేయబోయే సినిమా కూడా ఒక మాస్ హై ని ఇవ్వబోతున్న సినిమాగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…