Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ఊహించిన ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో గజకేసరి యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి రాజయోగం ఏర్పడనుంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరగడంలో ఉల్లాసంగా ఉంటారు. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం తో సహా మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) :కార్యాయాలల్లో ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారుల ఆదాయం పెరిగే అవకశాం. ఆర్థికంగా పుంజుకుంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. .
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బ్యాంకు రుణం అందుతుంది. స్నేహితుల్లో ఒకరి నుంచి నిరాశ వార్తలు వింటారు. వ్యాపార విస్తరణకు అవసరమైన ఆదాయం అందుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొన్ని తప్పుల నుంచి బయపడుతారు. కొత్తగా పెట్టుబడి పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆదాయం పెరుగుతుంది. అందుకు తగిన విధంగా ఖర్చులు ఉంటాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. లేకుంటే నష్టాలు ఉండే అవకాశం. కొత్త పనిని ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవాలి. మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : డబ్బు పొందడానికి అనేక మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొత్త పనులు చేయడానికి ఇదేమంచి సమయం. విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనడానికి మంచి సమయం.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశివారు తమ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుడి సలహాతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వ్యాపారంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆహ్లదకరమైన వాతావరణంలో ఉంటారు. ఆర్థిక పరిస్థితి అంతం మాత్రంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.