https://oktelugu.com/

Spirits: గరుడ పురాణం: మీ ప్రియమైన వారి ఆత్మ మీ చుట్టే ఉందని తెలిపే సంకేతాలు ఇవే..

మనిషి కర్మఫలాల ద్వారా నరకం, స్వర్గం చేరుతారు అంటుంది గురుడపురాణం. అయితే కోరికలు తీరకపోతే మాత్రం మన చుట్టే తిరుగుతుంటారు. మరి వారు మన చుట్టే తిరుగుతున్నారు అనడానికి సంకేతాలు ఏంటో తెలుసా? చనిపోయిన వ్యక్తులు మనకు పదే పదే కలలో కనిపిస్తుంటారు కొన్నిసార్లు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 4, 2025 / 06:00 AM IST

    Spirits

    Follow us on

    Spirits: ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత ఏ రోజు అయినా సరే చనిపోవాల్సిందే. మనిషి పుట్టుక చావులు సర్వసాధారణం. అయితే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏమౌతాడు? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఆత్మ గాలిలో కలిసిపోతుందని కొందరు అంటే తమకు నచ్చిన వారి చుట్టూనే తిరుగుతుందని కొందరు నమ్ముతుంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం కూడా ఆత్మలు ఉన్నాయని నమ్ముతారు కొందరు. మరి నిజంగానే.. మన వాళ్లు చనిపోయిన తర్వాత మన చుట్టూనే తిరుగుతారా? తిరిగితే ఆ విషయం ఎలా తెలుస్తుంది? అనే విషయాలను గరుడ పురాణం ఏ విధంగా చెబుతుందో తెలుసుకుందాం.

    మనిషి కర్మఫలాల ద్వారా నరకం, స్వర్గం చేరుతారు అంటుంది గురుడపురాణం. అయితే కోరికలు తీరకపోతే మాత్రం మన చుట్టే తిరుగుతుంటారు. మరి వారు మన చుట్టే తిరుగుతున్నారు అనడానికి సంకేతాలు ఏంటో తెలుసా? చనిపోయిన వ్యక్తులు మనకు పదే పదే కలలో కనిపిస్తుంటారు కొన్నిసార్లు. ఇలా జరిగితే వారి ఆత్మ ఇంకా.. మీ చుట్టూనే తిరుగుతున్నట్టు. అలా చనిపోయిన వాళ్లు కనిపించినప్పుడు చాలా ప్రశాంతంగా, నవ్వుతూ కూడా కనిపిస్తారట. మిమ్మల్ని రిలాక్స్‌గా భావిస్తుంటారు వారు. వారు ఎక్కడ ఉన్నా, వారు క్షేమంగా ఉన్నారని, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని చెపుతున్నట్టు. ఇలాంటి కలలు మీకు పదే పదే వస్తే మాత్రం వారి ఆత్మ మీ చుట్టే ఉందని అర్థం చేసుకోండి.

    అనుభూతి: అకస్మాత్తుగా మీ చుట్టు ఎవరు అయినా ఉన్నట్టు అనిపించినా, తిరిగినట్టు అనిపించినా, లేదా చల్ల, వేడి గాలి మీ ఒంటికి తాకినట్టు అనిపించినా సరే చనిపోయిన ప్రియమైన వ్యక్తి ఉనికికి సంకేతం అని అనుకోవాలట. ఈ భావన చాలా సార్లు చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే ఇది కొన్ని సార్లు సహజంగా కూడా సంభవించవచ్చు. కొన్ని సార్లు మీ ప్రియమైన వారి ఆత్మ వల్ల కూడా జరగవచ్చు అంటున్నారు పండితులు.

    సీతాకోకచిలుకలు, ఈకలు, నాణేలు లేదా ఇతర చిహ్నాలను పదే పదే చూస్తుంటే అది మీ ప్రియమైన వారి నుంచి వచ్చిన సందేశం అవచ్చు. ఉదాహరణకు, సీతాకోకచిలుకలు మీ వద్దకు పదే పదే వస్తుంటే మీ ప్రియమైన వారు మీతో ఉన్నారని చెప్పే నిష్క్రమించిన ఆత్మ చిహ్నంగా పరిగణించాలట. మీరు మీ చుట్టూ రంగురంగుల సీతాకోకచిలుకలను చూస్తే అది చనిపోయిన ప్రియమైన వ్యక్తి ఆత్మను సూచిస్తుంది. కొన్ని సార్లు చనిపోయిన వారు మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వారి వాయిస్ వినిపిస్తుంటుంది. మీరు ఏదైనా సమస్యలో ఇరుక్కున్నప్పుడు మీ ప్రియమైన వారిని తలుచుకున్నప్పుడు ఇలాంటిది జరుగుతుంది.

    ఎలాంటి సుగంద ద్రవ్యాలు లేకుండా కూడా మీకు దగ్గరలో ఏదైనా ఒక మంచి వాసన వస్తుంటే మీ ఆత్మీయులు మీ చుట్టూ ఉన్నారని అర్థం చేసుకోండి. ఈ అనుభవం మీ ప్రియమైన వ్యక్తి ఇప్పటికీ మీతోనే ఉన్నట్టుగా చెబుతుంది. ఒక విధంగా మీ జీవితంలో భాగమైనట్లు భావించాలి.

    జంతువుల అసాధారణ ప్రవర్తన వెళ్ళిపోయిన ఆత్మల ఉనికికి సంకేతం అంటున్నారు పండితులు. పక్షులు, కుక్కలు, ఇతర జంతువులు శక్తిని లోతుగా అనుభూతి చెందుతాయి. పక్షి పదే పదే వచ్చి మీ బాల్కనీ లేదా కిటికీ మీద కూర్చుంటే మీరు అనుమానించాల్సిందే. కుక్క ప్రవర్తన అకస్మాత్తుగా మారితే, ఇది సాధారణ విషయం కాదు. ఈ మార్పు మీ చుట్టూ ఉన్న నిర్దిష్ట శక్తిని అర్థం చేయిస్తుంది. అయితే జంతువులు తమ ప్రవృత్తి ద్వారా మానవులు విస్మరించగల విషయాలను మీకు అర్థం అయ్యేలా చెబుతుంటాయి. కుక్కలు ఒకే దిశలో పదేపదే మొరిగడం, కారణం లేకుండా చంచలంగా ప్రవర్తించడం కూడా అనుమానించాల్సిన విషయమే.