Jr. NTR : గత కొంత కాలం నుండి నందమూరి కుటుంబం లో అంతర్యుద్ధం నడుస్తుందని, జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలయ్య మధ్య చాలా పెద్ద గ్యాప్ ఏర్పడిందని, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కనీసం ఆయన్ని చూసేందుకు ఒక్క రోజు కూడా రాకపోవడానికి అసలు కారణం అదేనని, ఇలా మీడియా లో ఎన్నో కథనాలు చూసాం. అయితే వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అవన్నీ నిజమేనని అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి 7 గంటలకు బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ లేటెస్ట్ ఎపిసోడ్ ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి ‘డాకు మహారాజ్’ మూవీ టీం తరుపున తమన్, నాగ వంశీ, డైరెక్టర్ బాబీ వచ్చారు. వీళ్ళతో బాలయ్య కాసేపు సరదాగా జరిపిన సంభాషణ చూసే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది.
అయితే డైరెక్టర్ బాబీ ని బాలయ్య LED మీద కొందరి హీరోల ఫోటోలను చూపించి వాళ్ళ గురించి ప్రశ్నలు వేస్తాడు. డైరెక్టర్ బాబీ ఇప్పటి వరకు పని చేసిన హీరోలందరి ఫోటోలను చూపించి వాళ్ళ గురించి ఒక్క మాట చెప్పాల్సిందిగా కోరుతాడు. అయితే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మినహిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ తో డైరెక్టర్ బాబీ ‘జై లవ కుశ’ అనే సినిమా తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బాబీ కెరీర్ లో మొట్టమొదటి భారీ హిట్. అలాంటి సినిమాలో నటించిన హీరోని వదిలేసి, ఆయన దర్శకత్వం వహించిన మిగతా హీరోలందరి ఫోటోలను చూపించి ప్రశ్నలు వేస్తాడు. దీనిని చూసిన ఎన్టీఆర్ అభిమానులు కావాలనే మా హీరో ని పట్టించుకోలేదు అంటూ ఆరోపిస్తున్నారు. బాలయ్య మొదటి నుండి జూనియర్ ఎన్టీఆర్ అంటే అసూయ అని, ఆ కారణం చేతనే ఇలా సందర్భం దొరికినప్పుడల్లా అవమానిస్తూ ఉంటాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తారకరత్న చనిపోయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ వస్తే, వాళ్ళని బాలయ్య కనీసం పట్టించుకోలేదని, అప్పటి నుండి ఎన్టీఆర్ కూడా బాలయ్య కి దూరం ఉండడం మొదలు పెట్టాడని, బాలకృష్ణ మరియు నారా కుటుంబానికి సంబంధించి ఏ చిన్న శుభ కార్యంలో అయినా, వేరే ఇతర కార్యక్రమాల్లో అయినా పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారని అందుకే వాళ్ళు కూడా ఇప్పుడు బాలయ్య ని పట్టించుకోవడం మానేశారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో చెప్తున్నారు. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తో మంచి స్నేహపూర్వక వాతావరణం ని మైంటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మొదటి సినిమాకి సంబంధించిన పోస్టర్ ని జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసి మోక్షజ్ఞ కి శుభాకాంక్షలు తెలియచేసాడు. కేవలం బాలయ్య తో, నారా కుటుంబంతో మాత్రమే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు దూరం గా ఉంటున్నారు.
intentionally Done ?pic.twitter.com/IYCxJcP3rL
— Milagro Movies (@MilagroMovies) January 3, 2025