https://oktelugu.com/

Horoscope Today : శుభయోగం కారణంగా.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..

కొన్ని పనులు కష్టంగా ముందుకు సాగుతాయి. ఇతరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. కొన్ని పనులు అయిష్టంగానే పూర్తి చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి.

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2024 / 08:04 AM IST

    Horoscope

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తర భాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుభయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యారంగంలోని వారు మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు చంద్రుడు మేష రాశిలో సంచరించనున్నాడు. దీంతో మేషం నుంచి మీన రాశి వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి మహిళలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు సాధారణ లాభాలు ఉంటాయి. లాభదాయకమైన ఒప్పందాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు కోరాల్సి ఉంటుంది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.

    వృషభ రాశి:
    స్థిరాస్థి విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త పెట్టుబుడులు పెడుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయాలి. ఇంట్లో ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారు.

    మిథున రాశి:
    వ్యాపారులు బిజీగా ఉంటారు. మధ్యాహ్న సమయంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    కర్కాటక రాశి:
    అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు. పొరపాటున కూడా ఈరోజు వ్యాపారులు పెట్టుబడులు పెట్టకూడదు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో చిచ్చులు ప్రారంభం అవుతాయి.

    సింహారాశి:
    ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు జాగ్రత్తగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్ుమిక వాతావరణంలో ఉంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    కన్య రాశి:
    ఉద్యోగులు ఆందోళనకరంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబుడులను పెడుతారు. దీంతో అనుకోని ఆదాయం పొందుతారు. విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణిస్తారు. జీవిత భాగస్వామితో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

    తుల రాశి:
    కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బడ్జెట్ ప్రకారంగా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు విధుల కారణంగా బిజీగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

    వృశ్చిక రాశి:
    కొన్ని పనులు కష్టంగా ముందుకు సాగుతాయి. ఇతరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. కొన్ని పనులు అయిష్టంగానే పూర్తి చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి.

    ధనస్సు రాశి:
    కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అవసరమైన వ్యక్తులకు డబ్బు దానం చేస్తారు. మనసు చికాకుగా ఉంటుంది. కొందరు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. కొన్ని పనుల కారణంగా ఇతరులపై కోపాన్ని తెచ్చుకుంటారు.

    మకర రాశి:
    మధ్యాహ్నం వ్యాపార లాభాలపై ఎక్కువ దృష్టి పెడుతారు. ఆధ్యాత్మికం కోసం ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సోమరితనాన్ని వీడాలి.

    కుంభరాశి:
    ఉద్యోగులు ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ఆదాయం పెరిగినా వాటితో పాటు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఇతరుల సలహా తీసుకోవాలి.

    మీనరాశి:
    మీ ప్రవర్త కారణంగా ఇతరులు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఇంటి అవసరాలు తీర్చడంలో శ్రద్ధ చూపుతారు. వైవాహిక జీవితంలో కొన్ని చిక్కులు ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.