https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: మణికంఠ ని విసిరి కొట్టిన నిఖిల్.. స్పృహ తప్పి పడిపోయిన మణికంఠ..గేమ్ ఆపేసిన బిగ్ బాస్!

మణికంఠ తల నేలకు తగిలి కుప్పకూలిపోయాడు. నిఖిల్ ఇది గమనించకుండా మణికంఠ దగ్గర ఉన్న గుడ్లను మొత్తం పోగు చేసుకుంటాడు. అందరూ టాస్కు ఆడడం బిజీ గా ఉండడం వల్ల కుప్పకూలిపోయిన మణికంఠ పట్టించుకోరు. ఆ సమయం లో యష్మీ గమనిస్తుంది. వెంటనే మణికంఠ దగ్గరకు వెళ్లి , అభయ్ ని పిలుస్తుంది. అభయ్ గేమ్ ని బిగ్ బాస్ కి చెప్పి ఆపిస్తాడు. ఆ తర్వాత మణికంఠ కోలుకున్నాక గేమ్ ఆడేందుకు వస్తాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 19, 2024 / 08:16 AM IST

    Bigg Boss 8 Telugu(47)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ ప్రారంభం పెద్దగా బాగాలేకపోయినప్పటికీ రోజులు గడిచే కొద్దీ టాస్కులు ఆసక్తికరంగా మారాయి. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంది. ఎప్పటి లాగానే నాగ మణికంఠ తన నాటక విశ్వరూపం చూపించేసాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభావతి 2.0 పేరిట బిగ్ బాస్ ఒక టాస్కు ని నిర్వహించాడు. ప్రభావతి అని పెద్ద కోడి బొమ్మ పెట్టారు. ఆ కోడి గుడ్లు పొదుగుతుంది. రెండు క్లాన్స్ కి సంబంధించిన సభ్యులు ఆ గుడ్లను ఏరుకొని దాచిపెట్టుకోవాలి. అవతల క్లాన్ కి సంబంధించిన సభ్యులు గుడ్లను దొంగలించొచ్చు. వాటిని కాపాడుకునే బాధ్యత సభ్యులదే. అయితే ఈ టాస్కులో కంటెస్టెంట్స్ అందరూ బాగా ఆడుతారు. టాస్క్ కింగ్ గా పిలవబడే నిఖిల్ మరోసారి తన సత్తా చాటి అత్యధిక గుడ్లను పోగు చేసుకున్నాడు. ఆయన క్లాన్ కి సంబంధించిన వాళ్ళు కూడా బాగానే ఆడారు. మొత్తానికి నిఖిల్ లీడర్ షిప్ బాగుంది. అదంతా పక్కన పెడితే గుడ్లను పోగుచేసుకునే క్రమం లో నిఖిల్ మణికంఠ ని విసిరి అవతలేస్తాడు.

    మణికంఠ తల నేలకు తగిలి కుప్పకూలిపోయాడు. నిఖిల్ ఇది గమనించకుండా మణికంఠ దగ్గర ఉన్న గుడ్లను మొత్తం పోగు చేసుకుంటాడు. అందరూ టాస్కు ఆడడం బిజీ గా ఉండడం వల్ల కుప్పకూలిపోయిన మణికంఠ పట్టించుకోరు. ఆ సమయం లో యష్మీ గమనిస్తుంది. వెంటనే మణికంఠ దగ్గరకు వెళ్లి , అభయ్ ని పిలుస్తుంది. అభయ్ గేమ్ ని బిగ్ బాస్ కి చెప్పి ఆపిస్తాడు. ఆ తర్వాత మణికంఠ కోలుకున్నాక గేమ్ ఆడేందుకు వస్తాడు. అప్పుడు అభయ్ నీ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు, కాసేపు గేమ్ కి దూరంగా ఉండు అని అంటాడు. అప్పుడు మణికంఠ హౌస్ లోపలకు వెళ్లి గోడ బొక్కలో తలదూర్చి ఏడుస్తూ ఉంటాడు. అభయ్ అతనిని సముదాయించేందుకు దగ్గరకు రాగా, నేను గేమ్ ఆడాలి, బిగ్ బాస్ షో గెలవాలి, అప్పుడే నా భార్య, బిడ్డకు నా దగ్గరకు వస్తారు అంటూ నాటకాలు ప్రారంభించేసాడు.

    నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, గేమ్ ఆదుకురా అని చెప్పినందుకు దానిని పెద్దది చేసి ఎమోషనల్ డ్రామా ఆడాలి అనుకున్నాడు మణికంఠ. భార్య మీద అంత ప్రేమ ఉన్నటువంటి మణికంఠ హౌస్ లో లేడీ కంటెస్టెంట్స్ తో హగ్గులు ఇప్పించుకుంటాడు, ముద్దులు పెట్టుకుంటాడు, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తాడు. మళ్ళీ అకస్మాత్తుగా భార్య, బిడ్డ గుర్తుకు వచ్చి నాటకాలు చేస్తాడు. మణికంఠ దృష్టిలో జనాలు ఎలా కనిపిస్తున్నారో అసలు. మొదటి వారం మొత్తం ఈ డ్రామాలు ఆడుకుంటూ నెట్టుకొచ్చాడు. రెండవ వారం లో ఎదో పర్వాలేదు, తనని తాను మెరుగుపర్చుకున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ మూడవ వారం లో మళ్ళీ అదే తరహా డ్రామాలు మొదలు పెట్టాడు. ఇలాగే కనుక అతను కొనసాగితే 5 వారాల్లోపు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.