Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం ఏర్పడనున్నాయి. అంతేకాకుండా ఈరోజు మహాలయ అమావాస్య. దీంతో కొన్ని రాశుల వారు ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వ్యాపారులకు అనుకోకుండా డబ్బు వస్తుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రావి విద్యార్థులకు చదువులో ఉండే సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు తండ్రి సలహాతో పెట్టుబడులు పెడుతారు. కొత్త వస్తువువుల కొనుగోలు చేస్తారు.
వృషభ రాశి:
వ్యాపారులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఉల్లాసమైన వాతావరణంలో ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి.
మిథున రాశి:
అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పరీక్షల్లో విజయం సాధించడానికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు లాభాలపై దృష్టి పెడుతారు.
కర్కాటక రాశి:
వ్యాపారులు కొన్ని రిస్క్ లు తీసుకోవాల్సి వస్తుంది. కుటుం సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది.
సింహారాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటుంబ సభ్యులు, బంధువులతో విహార యాత్రలకు వెళ్తారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది.
కన్య రాశి:
వ్యాపారులు ఒత్తిడితో ఉంటారు. భవిష్యత్ లో సాయం చేయడానికి ముందుకు వస్తారు. బిజీ వాతావరణంలో ఉంటారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
తుల రాశి:
ఈ రాశివారు కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక లావాదేవీలు జరపడంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి:
ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొందరు విహార యాత్రలకు వెళ్తారు.
ధనస్సు రాశి:
ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రయాణాలు చేయాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. కొందరి సహకారంతో వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
మకర రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు చేసేవారు కొన్ని సూచనలు పాటించాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా డబ్బు వస్తుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు.
కుంభరాశి:
ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. దీంతో వారికి ప్రశంసలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. పిల్లలు అనారోగ్యాన బారిన పడే అవకాశం.
మీనరాశి:
పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల గౌరవంగా ఉంటారు. కొన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు ఉంటాయి.