Bigg Boss Telugu 8: సీజన్ 7 లో పెట్టిన టాస్కులనే మళ్ళీ పెట్టిన బిగ్ బాస్..మహా బోరింగ్ గా మారిపోతున్న ఎపిసోడ్స్!

గత సీజన్ 5వ వారం లో 'కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్' అనే టాస్కుని బిగ్ బాస్ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు, ఆ కలర్ కి సంబంధించిన వస్తువుని హౌస్ లో నుండి తీసుకొచ్చి బాక్స్ లో వెయ్యాలి.

Written By: Vicky, Updated On : October 2, 2024 8:13 am

Bigg Boss Telugu 8(59)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో పెడుతున్న టాస్కులను చిన్న పిల్లలు కూడా ఆడేయగలరు, చూసే ఆడియన్స్ కి ఏమాత్రం ఆసక్తి కలిగించడం లేదు, సీజన్ 7 లో ఉన్నటువంటి విన్నూతనమైన టాస్కులు ఈసారి బిగ్ బాస్ టీమ్ డిజైన్ చేయలేదని నాకు అనిపించినట్టుగానే మీ అందరికీ అనిపించి ఉండొచ్చు. సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు పూర్తి అయ్యింది. వారాలు గడిచేకొద్దీ టాస్కులు కఠినంగా మారుతుంటాయి, కానీ ఇక్కడ మొత్తం రివర్స్, వారాలు గడిచే కొద్దీ కంటెస్టెంట్స్ కి టాస్కులు సులభం అవుతున్నాయి. నిన్నటి టాస్కులలో రెండు టాస్కులు ఇంతకు ముందు మనం ఎప్పుడూ చూడనివి. అందులో ఒక్కటి బాల్స్ ని బ్యాలన్స్ చేసే టాస్క్, మరొకటి బాల్స్ కి కరెక్ట్ గా అవతల టేబుల్ వైపు ఉన్న నెట్స్ లోకి గురి చూసి విసరడం. ఈ రెండు టాస్కులు కాకుండా మొదటి గా వచ్చిన స్విమ్మింగ్ పూల్ టాస్క్ గత సీజన్ లో వచ్చిందే. అమర్ దీప్, సందీప్ మాస్టర్ ఈ టాస్కులో పాల్గొంటారు. సరిగ్గా అలాంటి టాస్కుని నిన్న ఎపిసోడ్ లో నిర్వహించారు. అలాగే రేపు జరగబోయే టాస్కులు కూడా గత సీజన్ లో పెట్టినవే.

గత సీజన్ 5వ వారం లో ‘కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్’ అనే టాస్కుని బిగ్ బాస్ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు, ఆ కలర్ కి సంబంధించిన వస్తువుని హౌస్ లో నుండి తీసుకొచ్చి బాక్స్ లో వెయ్యాలి. ఈ టాస్కు గత సీజన్ లో చాలా ఫన్నీ గా జరుగుతుంది. ఈ సీజన్ లో కూడా అదే టాస్కుని రిపీట్ చేసారు. ఇంత పెద్ద రియాలిటీ షో లో పెట్టిన టాస్కులే మళ్ళీ పెట్టడం ఏమిటి?, బిగ్ బాస్ కి బోర్ కొట్టకపోవచ్చు కానీ, చూసే ఆడియన్స్ కి తెగ బోర్ కొట్టేసింది. లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఫీలింగ్ కూడా అదే, కానీ బయటకి చెప్పుకోలేని పరిస్థితి పాపం.

గత సీజన్ లో ఈ టాస్కు నడుస్తున్న సమయంలోనే బిగ్ బాస్ అమర్ దీప్ తో ఒక కామెడీ చేస్తాడు. పూల్ లో ఉన్న నీటిని స్పూన్ తో ఖాళీ చెయ్యాలి అంటాడు, అదే తరహా కామెడీ ని బిగ్ బాస్ నబీల్ తో చేస్తాడు. ఎంత బడ్జెట్ లేకపోతే మాత్రం ఎంటర్టైన్మెంట్ ని కూడా గత సీజన్ నుండి కాపీ కొట్టాలా?, ఇదెక్కడి న్యాయం బిగ్ బాస్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో కంటెస్టెంట్స్ తక్కువ మంది ఉన్నారు. బిగ్ బాస్ కి వాళ్ళతో ఎలాంటి గేమ్స్ ఆడించాలో అర్థం కాక ఇలాంటి కామెడీ గేమ్స్ ని ఆడిస్తున్నట్టుగా అనిపించింది. ఇదే తరహాలో ముందుకు పోతే మాత్రం ఈ సీజన్ అతి పెద్ద డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.