water : జీవనశైలి మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే లేచిన తర్వాత చేసే పనులే మన ఆరోగ్యాన్ని తెలుపుతాయి. ఈరోజుల్లో చాలామంది ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడటం, మసాలా ఫుడ్ తినడం, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వంటివి చేస్తుంటారు. ఉదయం పూట ఇలాంటివి చేయడం వల్ల రోజంతా నీరసంగా ఉండటంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలామంది ఉదయం బ్రష్ చేసిన తర్వాత వేడి నీరు తాగుతారు. దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే బ్రష్ చేయకుండా ఉదయం నీరు తాగితే చాలా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గుతారు
చాలామంది ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేయకుండా కాఫీ లేదా టీ వంటివి తాగుతుంటారు. వీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రష్ చేయకుండా కాఫీ, టీ కంటే నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వును తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది చక్కగా పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
చర్మ ఆరోగ్యం
లేచిన వెంటనే బ్రష్ చేయకుండా నీరు తాగడం చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ముడతలు లేకుండా క్లీన్‌గా ఉంటుంది. వాటర్ తాగడం వల్ల చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో అందంగా తయారవుతారు.
జీర్ణ సమస్యలు
బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మూత్ర విసర్జన ఫ్రీగా అవుతుంది. మలబద్దకంతో బాధపడుతున్న వాళ్లకి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీరు తాగితే మలబద్దకానికి ఇంకా మంచిగా పనిచేస్తుంది.
షుగర్ నియంత్రణ
ఇలా నీరు తాగడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే రక్తపోటు పెరగకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. షుగర్‌తో బాధపడేవారు ఉదయం నీరు తాగడం వల్ల షుగర్ స్థాయిలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయం జ్యూస్‌లు వంటివి కాకుండ మొదట నీరు అధికంగా తాగండి.
బద్దకం నుంచి విముక్తి
చాలా మంది ఉదయం లేచిన తర్వాత బద్దకంగా ఉంటారు. అసలు బెడ్ మీద నుంచి లేవకుండా టైమ్ పాస్ చేస్తారు. ఒకవేళ కష్టంగా లేచిన కూడా రోజంతా సోమరితనం ఉంటుంది. దీంతో ఏ పనిని కూడా సరిగ్గా సమయానికి చేయలేరు. అదే ఉదయం నీరు తాగితే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎలాంటి నీరసం, అలసట వంటివి ఉండవు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.