Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడనుంది. దీంతో రెండు రాశుల వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మరికొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారు కొత్త ఉపాధి మార్గాలను ఎంచుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పని ప్రదేశంలో తోటివారితో సంయమనం పాటించాలి. కొత్త వారికి డబ్బు ఇవ్వకుండా ఉండాలి.
వృషభ రాశి:
విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఆర్థికంగా పుంజుకుంటారు. కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని పనుల కారణంగా నిరాశతో ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం విషయంలో ఆలోచించాలి.
మిథున రాశి:
రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు తమ అనుభవం ఆధారంగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.
కర్కాటక రాశి:
కుటుంబ సభ్యుల విషయంలో అసంతృప్తిగా ఉంటారు. భవిష్యత్ గురించి బాధపడుతారు. ఆశించిన మేరకు ధన లాభం ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆదాయం రావడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.
సింహారాశి:
కొత్త వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి. మనసులో విచారం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత లోటు ఏర్పడుతుంది. కొన్ని కొత్త సమస్యలు వెంటాడుతాయి. పూర్వీకుల ఆస్తిపై శుభవార్త వింటారు.
కన్య రాశి:
ఆర్థికంగా పుంజుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అదనపు ఖర్చులు ఉంటాయి. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రహస్యాలను కొత్త వ్యక్తులకు చెప్పకుండా ఉండాలి.
తుల రాశి:
కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో మంచిగా ప్రవర్తించాలి. లేకపోతే మనసు ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ల తో సంయమనం పాటించాలి. కోరికలను అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చిక రాశి:
వ్యాపారులకు చాలా విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎవరికీ కొత్త వాగ్దానాలు చేయొద్దు. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మోసం చేసే అవకాశం ఉంది.
ధనస్సు రాశి:
ఈ రాశి వారు అనేక విషయాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. బయటి వ్యక్తులను పరిచయం చేసుకునేముందు ఆలోచించాలి. మహిళలు కొన్ని పనులు చేసేముందు సలహాలు తీసుకోవాలి. సోదరుల సాయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మకర రాశి:
ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ పొందే అవకాశం. తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమేతోటి వారితో వాదనలకు దిగాలి.
కుంభరాశి:
వ్యాపారులకు అనుకోని లాభాలు. ఆర్థికంగా పుంజుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనుల కారణంగా ఉద్యోగులు బిజీగా ఉంటారు. శక్తి సామర్థ్యాల మేరకు మాత్రమే దానాలు చేయాలి.
మీనరాశి:
ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండకూడదు. సోమరితనంను వీడాలి. అయిష్టంగా ఎటువంటి పనులు చేయొద్దు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు వెతుక్కుంటారు.