https://oktelugu.com/

Train journey food : ట్రైన్ లో జర్నీ చేస్తున్నారా.. కూర్చొన్న చోటుకు.. కావాల్సిన ఫుడ్ ను ఇలా తెప్పించుకోండి..

ఒక్కోసారి కాలు జారి రైలు కింద పడే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్య లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? కూర్చున్న చోటు కావాల్సిన ఫుడ్ ను ఎలా తెప్పించుకోవాలి? ఈ వివరాల్లోకి వెళ్లండి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 29, 2024 7:49 pm
    Train journey food

    Train journey food

    Follow us on

    Train journey food : కొందరికి నిత్యం ట్రైన్ జర్నీ చేయడం అలవాటు. తక్కువ ధరలో చాలా దూరం ప్రయాణించడానికి రైలు ప్రయాణమే ఉత్తమం. ఎందుకంటే ట్రైన్ జర్నీలో సకల సౌకర్యాలు ఉంటాయి. జర్నీ చేస్తుండగానే కూర్చోవచ్చు.. నిద్రించవచ్చు.. భోజనం కూడా చేయవచ్చు. అయితే చాలా మందికి ట్రైన్ లో విక్రయించే ఫుడ్ నచ్చదు. దీంతో కొందరు ఇంటి నుంచే ఆహారం తీసుకొని వస్తారు. కానీ దూర ప్రయాణం చేసేవారికి ఈ సౌకర్యం ఉండదు. ఇలాంటి సమయంలో ఏదైనా స్టేషన్ వచ్చినప్పుడు కావాల్సిన ఆహార పదార్థాలు తీసుకుంటారు. కానీ ఇదే సమయంలో ట్రైన్ కదిలి వెళితే.. నడుస్తున్న రైలులో ఎక్కే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి కాలు జారి రైలు కింద పడే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్య లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? కూర్చున్న చోటు కావాల్సిన ఫుడ్ ను ఎలా తెప్పించుకోవాలి? ఈ వివరాల్లోకి వెళ్లండి..

    ఇప్పుడు ఏ అవసరం కావాలన్న మొబైల్ ద్వారా తీర్చుకోవచ్చు. మనీ ట్రాన్స్ ఫర్ నుంచి సరుకులు కొనే వరకు అన్నీ మొబైల్ నుంచే నడిపించొచ్చు. ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది రెస్టారెంట్, హోటళ్లలోకి వెళ్లి భోజనం, ఇతర పదార్థాలు తినడం లేదు. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి కావాల్సిన ఆహారం తెప్పించుకుంటున్నారు. అయితే ట్రైన్ జర్నీ చేసే సమయంలో జొమాటో, స్విగ్గీ నుంచి ఆహారం తెప్పించుకోవడం ఎలా? ఒకవేళ ఈ సంస్థలు అందుబాటులో లేకపోతే కావాల్సిన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఎలా తెప్పించుకోవాలి?

    ఇందుకోసం చిన్న ట్రిక్ ఫాలో కావాలి. ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో కూర్చున్న చోటుకే కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకోవచ్చు. ముందుగా 7441111266 నెంబర్ కు వాట్సాప్ మెసెజ్ చేయాలి. ఈ నెంబర్ కు Hi అని మెసేజ్ చేయాలి. ఈ మెసేజ్ చేసిన తరువాత హిందీ, ఇంగ్లీష్ లల్లో మీకు కావాల్సిన ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత ట్రైన్ టికెట్ పై ఉన్న పీఎన్ ఆర్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీకు సంబంధించిన డీటేయిల్స్ వస్తాయి. దీనిని కన్ఫామ్ చేయాలి. ఆ తరువాత ఏ స్టేషన్ లో ఫుడ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి.

    సంబంధిత స్టేషన్ పై క్లిక్ చేయగానే దగ్గర్లోని కొన్ని రెస్టారెంట్లు కనిపిస్తాయి. మీకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ కావాలంటే దీని ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ స్టేషన్ దగ్గర్లోకి వెళ్లిన తరువాత కావాల్సిన ఫుడ్ కూర్చున్న వద్దకే వస్తుంది. ఇలా కావాల్సిన ఆహారాన్ిన ట్రైన్ జర్నీలో కూడా పొందే అవకాశం ఉంది. దీంతో ట్రైన్ ఫుడ్ అలర్జీ ఉన్న వారు, ఇతర ఆహార పదార్థాలు నచ్చని వారు ఇలా కావాల్సిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫుడ్ తీసుకొచ్చినందుకు మినిమం ఛార్జీలు వసూలు చేస్తారు. సిటీకి స్టేషన్ దూరంగా ఉంటే కాస్త ఎక్కువే ఉంటుంది. ఇలాంటి సమయంలో సిటీలో ఉండే స్టేషన్ ను ఎంచుకోవడం ఉత్తమం..