https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారా.? అయితే జాగ్రత్త..!

ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నాణ్యమైన ఆహారం తినాలి. వ్యాపారులకు ఎవరైనా సలహా ఇస్తే దానిని పాటించాలి. కొన్ని శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 25, 2024 / 08:32 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై ఉత్తర ఫాల్గుణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభాలు ఉండలున్నాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి: కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇంట్లో వాతావరణం ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి.

    వృషభ రాశి: ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నాణ్యమైన ఆహారం తినాలి. వ్యాపారులకు ఎవరైనా సలహా ఇస్తే దానిని పాటించాలి. కొన్ని శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

    మిథున రాశి: పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. ఓ పార్టీలో పాల్గొనడంతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    కర్కాటక రాశి: వివాహ ప్రయత్నాలు చేసే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వ్యాపారంలో చేసే ప్రణాళికలు లాభిస్తాయి. కుటుంబంలో ఒకరి చర్యవల్ల భాగోద్వేగంతో ఉంటారు.

    సింహారాశి: పెద్దల ఆశీర్వాదంతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. ఆహారపు అలవాట్ల విషయంలో తొందర పడొద్దు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

    కన్య రాశి: ఈ రాశి వారికి అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామి మద్దతుతో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. సాయంత్రం అకస్మాత్తుగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    తుల రాశి: ఉద్యోగులు సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్యం పై ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం. అందువల్ల నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.

    వృశ్చిక రాశి: వ్యాపారాలు తీసుకునే నిర్ణయాలపై ఆచితూచి వ్యవహరించాలి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండే సమస్యలు పరిష్కరించబడతాయి. ఉద్యోగులకు తోటి వారి సహాయం అందుతాయి. ప్రయాణం చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.

    ధనస్సు రాశి: కార్యాలయాల్లో ఉద్యోగులు ఈరోజు ఒత్తిడితో ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. సాయంత్రం సోదరులతో కలిసి కొన్ని పనులు పూర్తి చేస్తారు.

    మకర రాశి: విహారయాత్రలకు వెళ్తారు ఈ కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం. కొన్ని ప్రయాణాలు వ్యాపారులకు లాభాలు చేకూరుస్తాయి. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.

    కుంభరాశి: ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం తథ్యం. కొత్త ఆస్తిని కొనడానికి ప్రయత్నిస్తే కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఖర్చులు ఉంటాయి.

    మీనరాశి: కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు తల్లిదండ్రుల సలహా ఉంటుంది. ఒత్తిడి నుంచి విద్యార్థులు పశుమనం పొందుతారు.