Horoscope: మే నెల రాగానే చాలా మందికి భయం వేస్తుంది. ఎందుకంటే ఈ నెలలో ఎండలు మరింత మండిపోతాయి. కాలు అడుగుభయటపెట్టాలంటే గజగజ వణకాల్సిందే. కానీ ఈసారి మే నెల కొన్ని రాశుల వారికి వరాల పంట పండించడానికి రెడీ అవుతోంది. మే నెలలో గురు గ్రహం సంచారం చేయనుంది. దీనితో పాటు చంద్ర గ్రహం ఉండడంతో గజకేసరి రాజయోగం పట్టనుంది. ఈ సంఘటన కొన్ని రాశులపై ప్రభావం పడి వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇది మే మొదటి వారం నుంచే ప్రారంభం కానుంది. మరి ఆ రాశులేవో చూద్దాం.
మే నెల నుంచి కన్యా రాశి వారికి అనుకూల ప్రయోజనాలు కలగనున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సపోర్టు ఉంటుది. ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కొత్త కాంట్రాక్టులు ఏర్పడుతాయి. కొన్ని ప్రయాణాలు ఉండడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. బంధువుల నుంచి కొన్ని డబ్బలు వస్తాయి.
మేష రాశి వారికి ఈ నెల నుంచి రాజయోగం పట్టనుంది. ఇప్పటి నుంచి వీరు ఏ పని చేసినా లాభమే జరుగుతుంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్తితి మెరుగుపడుతుంది. ఎక్కువగా శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి నుంచి సపోర్టు ఉంటుంది. కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
గజకేసరి రాజయోగం వృశ్చిక రాశి వారికి కలగనుంది. ఎప్పటి నుంచి ఉన్న సమస్యలు మే నెల నుంచి తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అప్పలు తిరిగి వసూలవుతాయి. అన్ని పనులు సులభంగా చేసుకోగలుగుతారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఏ పని చేసినా విజయం మీ సొంతం అవుతుంది.