Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 జనవరి 26 శుక్రవారం ఓ రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
వ్యాపారులకు అప్పుల బాధలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది. వివాదాల పెరిగే అవకాశం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
ఆకస్మిక ధన లాభం. స్నేహితులు, సోదరుల నుంచి మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా వాదనలు దిగొద్దు. అనవసర విషయాల్లోకి తలదూర్చొద్దు.
మిథునం:
ఆర్థిక లాభాలు ఉంటాయి. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టే సమయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి.
కర్కాటకం:
మానసికంగా ఆందోళనగా ఉంటారు. ప్రియమైన వారితో గొడవలకు దిగొద్దు. ప్రయాణాలు చేసేటప్పడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.
సింహ:
ఈ రాశివారు కొన్ని శుభవార్తలు వింటారు. మాట తీరుతో ప్రజల్లో గుర్తింపు వస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టోచ్చు.
కన్య:
ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతారు.
తుల:
కష్టపడడం ద్వారా కొన్ని అనుకున్న పనులు పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో తొందరపడొద్దు. కాస్త ఓపిక పట్టాలి. ఆకస్మిక అదృష్టం వస్తుంది. ఉద్యోగుల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
వృశ్చికం:
కొన్ని చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంటారు. ఓ పని కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉన్నా.. జాగ్రత్తలు పాటించాలి.
ధనస్సు:
గతంలో మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆందోళనకు గురి కావొద్దు. కెరీర్ కు సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి.
మకర:
వాదనలు ఎక్కువగా చేస్తారు. ఈ విషయంలో ఆందోళనతో ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో సంయమనం పాటించాలి.
కుంభం:
ఈ రాశివారు శుభవార్తలు వింటారు. సంక్లిష్టమైన సమస్యలు పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారంలో డబ్బు సాయం అందుతుంది.
మీనం:
మీరు చేసే పనుల్లో కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. రోజంతా నిరాశగా ఉంటారు. సామర్థ్యానికి తగినట్లుగా పనులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పనులు మరిచిపోవద్దు.