మరికొన్ని గంటల్లో 2024 ఏడాది పూర్తి కాబోతుంది. అసలు కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు కొందరు తమ రాశి ఫలం చూసుకుంటారు. ఈ ఏడాది ఎలా ఉంది? అంతా మంచే జరుగుతుందా? లేదని? చూస్తారు. మరి ఈ కొత్త సంవత్సరంలో ఏయే రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారిని అదృష్టం వరించిందో చూద్దాం.
మేష రాశి
ఈ ఏడాది మేష రాశి వారికి బాగుంది. కెరీర్‌లో మంచి ఎదుగుదల ఉంటుంది. అలాగే సమస్యలు అన్ని కూడా తీరుతాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. అయితే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ ఏడాది అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఏ పని తలపెట్టిన విజయమే సిద్ధిస్తుంది. ఉద్యోగంలో మంచి మార్పులు కెరీర్‌లో అభివృద్ధి కనిపిస్తోంది. బంధాలు బలపడతాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.
మిథునం
మిథున రాశివారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మార్చి వరకు కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత పరిస్థితులు సర్దుకుంటాయి. కెరీర్‌లో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు చేస్తే మంచి లాభాలు పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ ఏడాదిలో బంగారు పంట పండబోతుంది. ఏ పని తలపెట్టిన కూడా విజయం లభిస్తుంది. అంతా వీరికి అనుకూలంగానే జరుగుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ ఏడాది అభివృద్ధి ఉంటుంది. అనుకున్న పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి. ప్రమోషన్లు, వ్యాపారాలు మంచి లాభాలు వస్తాయి. అలాగే విజయం వర్థిల్లుతుంది. కానీ కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కన్యా రాశి
కన్యారాశి వారు ఈ ఏడాది ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మాటల విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఈ ఏడాది కుటుంబంలో తగాదాలు, ఆర్థిక సమస్యలు కూడా తప్పవు.
వృశ్చిక రాశి
కెరీర్‌లో వృశ్చిక రాశి వారు ఎత్తుకి ఎదుగుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. కానీ కాస్త ఒత్తిడికి గురవుతారు.
ధనుస్సు రాశి
అధిక వ్యయం అవుతుంది. ఇతరులతో గొడవలు అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహితులకు మంచి అవకాశం. మంచి సంబంధాలు కుదురుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ ఏడాది బాగుంది. అభివృద్ధి, మార్పుకి తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ ఏడాదిలో పురోగతి లభిస్తుంది. కెరీర్‌లో బాగుంటుంది. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు.
కుంభ రాశి
ఈ ఏడాది కుంభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతీ విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి.
మీన రాశి
ఈ ఏడాది మీన రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఇంట్లో కొన్ని సమస్యలు రావచ్చు. కానీ ఉద్యోగంలో మాత్రం ప్రమోషన్లు పొందుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.