https://oktelugu.com/

K S Ravikumar: సినిమాలో రమ్యకృష్ణ సౌందర్య ముఖం మీద కాలు పెట్టే సీన్… చేయనని ఆమె ఎంత ఏడ్చినా ఒప్పుకోలేదు.. చివరికి ఏమైందంటే..

నరసింహ సినిమాలో పొగరు, మొండి పట్టుదల ఉన్న నీలాంబరి పాత్రకు ఎవరైతే బాగుంటుందని అనుకున్న సమయంలో మీనా మరియు నగ్మా పేర్లు వినిపించాయి. అయితే అప్పటికే కేఎస్ రవికుమార్ మీనాతో స్నేహం కోసం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Mahi
  • , Updated On : December 31, 2024 / 04:25 PM IST

    K S Ravikumar

    Follow us on

    KS Ravikumar: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటివరకు చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆయన సినిమాలలో నరసింహ సినిమాకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు మరో పాత్ర కూడా బాగా హైలైట్ అయింది. అదే రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర. అయితే ముత్తు, భాష, అరుణాచలం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రజినీకాంత్ మరో సూపర్ హిట్ సినిమాలో నటించాలని అనుకున్నారు. ఈ క్రమం లోనే ఎవరితో సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్న సమయంలో దర్శకుడు కేఎస్ రవికుమార్ తో సినిమా చేయాలని రజినీకాంత్ భావించారు. కథ ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలితను సూచిస్తూ ఆమె జీవితంలో పంతాలకు, పట్టింపులకు పోయి పెళ్లి చేసుకొని ఒక కథానాయక కథను రెడీ చేయమని రజినీకాంత్ రవి కుమార్ ను కోరారట. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన కథ నరసింహ సినిమా కథ. ఈ సినిమాకు ముందు దర్శకుడు కేఎస్ రవికుమార్ మెగాస్టార్ చిరంజీవితో తెలుగులో స్నేహం కోసం సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికు జోడిగా మీనా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. నరసింహ సినిమాలో పొగరు, మొండి పట్టుదల ఉన్న నీలాంబరి పాత్రకు ఎవరైతే బాగుంటుందని అనుకున్న సమయంలో మీనా మరియు నగ్మా పేర్లు వినిపించాయి. అయితే అప్పటికే కేఎస్ రవికుమార్ మీనాతో స్నేహం కోసం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాలో మీనా ఒక సన్నివేశంలో అగ్రెసివ్ లుక్ లో కనిపించాలి. అయితే మీనా ఆ సన్నివేశంలో బాగా నటిస్తున్నప్పటికీ ఆమె మొహంలో ఆ లుక్ రాలేదని కేఎస్ రవికుమార్ అనుకున్నారు. ఆ తర్వాత రజనీకాంత్ మీనాని అనుకున్నాం కదా అని రవికుమార్ ను అడిగినప్పుడు అయినా అదే విషయాన్ని రజనీకాంత్ తో చెప్పుకొచ్చారు.

    ఇక ఆ తర్వాత నీలాంబరి పాత్రకి నగ్మాను అనుకున్నప్పటికీ ఆమె పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక హీరోయిన్ రమ్యకృష్ణకు కె ఎస్ రవికుమార్ తో పరిచయం ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేయలేదు. రమ్యకృష్ణతో తనకున్న పరిచయంతోనే రవికుమార్ నరసింహా సినిమాలో నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేశారు. నరసింహ సినిమాలో నీలాంబరి యారొగెంట్ పాత్రలో రమ్యకృష్ణ బాగా న్యాయం చేసిందని తెలుస్తుంది. హీరో రజనీకాంత్ తో ఇలాంటి రోల్ చేయడానికి ముందుగా రమ్యకృష్ణ ఆలోచించినప్పటికీ ఈ పాత్రను సవాల్ గా చేసుకొని నటించాలని అనుకుంది. ఇది ఇలా ఉంటే నరసింహ సినిమాలో ఒక సన్నివేశంలో రమ్యకృష్ణ హీరోయిన్ సౌందర్య ముఖం మీద కాలు పెట్టి ఏమిటి ఏడుస్తున్నావా..? మీ స్థితి ఏమిటి.. పరిస్థితి ఏమిటి.. నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తిని ఉంటావు. కానీ నేను తలుచుకుంటే చంద్రమండలంలోనే తినగలను అంటూ కాలితో అటు ఇటు అనే సన్నివేశం అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది.

    ఈ సన్నివేశాన్ని దర్శకుడు ముందుగా రమ్యకృష్ణ కు చెప్పడంతో ఆమె సౌందర్యం అలా కాలితో అనడం బాగా ఇబ్బందిగా ఫీలయ్యింది. కానీ దర్శకుడు ఒత్తిడి చేయడంతో ఆ సన్నివేశం చేయనని రమ్యకృష్ణ బాగా ఏడ్చిందట. చివరికి హీరోయిన్ సౌందర్య మరియు దర్శక నిర్మాతలు చెప్పడంతో ఆ సన్నివేశం చేయడానికి రమ్యకృష్ణ ఒప్పుకుందట. అప్పట్లో ఈ సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ సినిమా షూటింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.