https://oktelugu.com/

Astrology : ఈ తేదీల్లో ఆడపిల్లలు పుడితే తండ్రులు అదృష్టవంతులు.. ఎలాగో తెలుసా?

కొందరు ఆడపిల్లలు జన్మించగానే ఆ ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది. అప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆమె తండ్రి ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. అయితే వీరు ఈ తేదీల్లో జన్మించి ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...

Written By:
  • Srinivas
  • , Updated On : October 1, 2024 / 12:57 PM IST

    Astrology

    Follow us on

    Astrology :  కంటే కూతుర్నే కనాలి అంటారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి ఉన్నట్లే. ఆడపిల్లలు ఉన్న ఇల్లు సంతోషంగా, సందడిగా ఉంటుంది. పూర్వ కాలంలో ఆదాయ వనరులు సరిగా లేకపోవడంతో కొందరు అమ్మాయిలను భారంగా భావించేవారు. కానీ నేటి కాలంలో ఆడపిల్ల తమ కడుపులో పుట్టాలని ఎదురుచూసేవారు ఉన్నారు. చాలా ఇళ్లల్లో ఆడపిల్ల పుట్టగానే తమ ఇల్లు సంతోషంగా మారిందని చెబుతూ ఉంటారు. అయితే కొందరు ఆడపిల్లలు జన్మించగానే ఆ ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది. అప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆమె తండ్రి ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. అయితే వీరు ఈ తేదీల్లో జన్మించి ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆ వివరాల్లోకి వెళితే…

    హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం నిర్వహించుకున్నా.. ముందుగా జ్యోతిష్యులను సంప్రదిస్తారు. ముఖ్యంగా అబ్బాయి లేదా అమ్మాయి పుట్టగానే వారి జాతక వివరాలను తెలుసుకుంటారు. వీటిని భట్టే వారి భవిష్యత్ ఎలా ఉంటుంది? అనే అంచనాకు వస్తారు. కొందరు జ్యోతిష్యులు పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకాన్నిఅంచనా వేస్తారు. ఈ క్రమంలో కొన్ని అదృష్ట సంఖ్యల గురించి చెబుతారు. ఆయా తేదీల్లో జన్మించిన వారికి వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా మంచి జరిగేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే వీరిలో ఆడపిల్ల పుడితే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

    అయితే ఆడపిల్ల కొన్ని తేదీల్లో జన్మించడం వల్ల ఆమె కుటుంబ సభ్యులకు అదృష్టం వరించనుంది. అవి 2, 22, 20, 29. సాధారణంగా 1 నుంచి 9 అంకెలు 9 గ్రహాలకు సంబంధించినవి. కొన్ని కథనాల ప్రకారం.. పై తేదీల్లో ఆడవాళ్లు జన్మిస్తే అదృష్టవంతులని నిర్ణయిస్తారు. ముఖ్యంగా అదృష్ట సంఖ్య రెండు ఉన్న ఆడవారు అదృష్ట వంతులు. వీరు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరు ఎక్కడ అడుగుపెడితే అక్కడ శుభప్రదంగా ఉంటుంగి. 2,11, 20 తేదీల్లో పుట్టిన వారిని నంబర్ 2 గా భావిస్తారు.

    ఈ తేదీల్లో జన్మించిన వారి తండ్రికి చాలా ఉపయోగాలు ఉంటాయి. వారి తండ్రికి అనుకోని అదృష్టం వస్తుంది. వ్యాపారం చేసేవారైతే అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులైతే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అంతేకాకుండా వీరు మిగతా వారికంటే తెలివైన వారు ఉంటారు. వీరితో పాటు వీరి కూతుళ్లు కూడా చదువులో, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి గ్రహాలు అనుకూలంగా మారి అదృష్ట రేఖ వారి జాతకం నుంచి వెళ్తుంది. సాధారణంగా రాశి చక్రం వ్యక్తి యొక్క జీవితాన్ని భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. కానీ న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారి జాతకం తెలుస్తుంది. అయితే ఈ లేదీలు కాకుండా మిగతా తేదీల్లో ఉన్న వారు రాణించాలంటే కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిత్యం భగవన్నాస్మరణ చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొనడం వల్ల అదృష్టం కలిసివస్తుంది. గుళ్లు, గోపురాలు సందర్శించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.