Deadpool And Wolverine OTT: హాలీవుడ్ యాక్షన్ బ్లాక్ బస్టర్ డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ ఓటీటీ డిటైల్స్, ఎక్కడ చూడొచ్చంటే?

హాలీవుడ్ యాక్షన్ మూవీ డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ డిజిటల్ స్ట్రీమింగ్ డిటైల్స్ మీ కోసం..

Written By: S Reddy, Updated On : October 1, 2024 1:02 pm

Deadpool And Wolverine OTT

Follow us on

Deadpool And Wolverine OTT: రియాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్మన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ డెడ్ పూల్ అండ్ వోల్వరైన్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కింది. షాన్ లెవీ ఈ చిత్ర దర్శకుడు. జులై 26న విడుదలైన డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లు రాబట్టింది. $200 మిలియన్స్ తో నిర్మించగా $ 1.326 బిలియన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వసూలు చేసింది.

కాగా డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ డిజిటల్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 1 నుండి ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుంది. యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికి డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన చిత్రాలన్నీ హాట్ స్టార్ లో ఉన్నాయి.

డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ చిత్రంలో రియాన్ రెనాల్డ్స్ వేడ్ విల్సన్/డెడ్ పూల్ అనే పాత్ర చేశాడు. ఇక హ్యూ జాక్మన్ లోగన్/వోల్వరైన్ రోల్ చేశాడు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. ఎమ్మా కొర్రీన్, మోరేనా బకారిన్ ఇతర కీలక రోల్స్ చేశారు. మార్వెల్ కామిక్స్ ఆధారంగా డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ చిత్రం తెరకెక్కింది.

మూవీ లవర్స్ కి ఈ వారం పండగ అని చెప్పొచ్చు. ఏకంగా 25 సినిమాలు/ సిరీస్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి. చిన్న సినిమాగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న 35 చిన్న కథ కాదు ఆహాలో స్ట్రీమ్ కానుంది. తమన్నా నటించిన తమిళ చిత్రం అరణ్మనై 4 సైతం డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.

మరోవైపు థియేటర్స్ లో ఎన్టీఆర్ నటించిన దేవర సంచలనాలు చేస్తుంది. మూడు రోజుల్లో మూడు వందలకు పైగా కోట్లు వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ మినహాయించి, ఎన్టీఆర్ గత చిత్రాల రికార్డ్స్ దేవర బ్రేక్ చేసింది. అలాగే కార్తీ నటించిన ఎమోషనల్ కామెడీ డ్రామా సత్యం సుందరం విడుదలైంది.