https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్త.. ఎందుకంటే..?

కొందరు వ్యాపారులు శుభవార్తలు వింటారు. అయితే ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Written By:
  • Srinivas
  • , Updated On : January 2, 2025 / 07:51 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొందరు వ్యాపారులు శుభవార్తలు వింటారు. అయితే ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : వ్యాపారులు ఈరోజు శుభవార్తలు వింటారు. అనుకోకుండా లాభాలు పెరిగే అవకాశం. కొన్ని పనులు అనుకున్న సమయంలో పూర్తి కావడంతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : మానసికంగా ఆందోళనగా ఉంటారు. చెడు ప్రభావాల వైపు మనసు మరలకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. పై అధికారుల నుంచి దూషణలు ఎదుర్కొంటారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. దీంతో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అయితే కొన్ని రంగాల వారికి చంద్ర సంచారం కారణంగా అనుకూలంగా లేదు. దీంతో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృథా చేయకుండా అవసరమైన పనులు మాత్రమే చేయాలి.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్ని రంగాల వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. అయినా ముందుకు వెళ్లాలి. అనవసరంగా ఇతరులతో వాగ్వాదానికి దిగకూడదు.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణ ఉండదు. కాలాన్ని వృథా చేయకుండా పనులు పూర్తి చేసుకోవాలి. కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఊహించని లాభాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని రంగాల వారికి అడ్డంకులు ఏర్పడతాయి. కానీ మనం ధైర్యంతో ముందుకు వెళ్లాలి. అనారోగ్య సమస్యలపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఆందోళన చెందడం వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు అనుకున్న ఫలితాలు పొందుతారు. కీలక నిర్ణయం తీసుకునే సమయంలో తడబడతారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వాలి. జీవిత భాగస్వామితో వాద ఉంటుంది. కోపతాపాలకు పోకుండా మంచి పనులపై దృష్టి పెట్టాలి.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల అధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొనడానికి ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది దీంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులు ఓ శుభవార్త వింటారు. దీంతో సంతోషంగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను దూరం చేసుకోకుండా ఉండడానికి వారితో ఎక్కువగా వాదనలకు దిగవద్దు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఏ పని ప్రారంభించినా మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి. అనుకున్న పని పూర్తి చేసే వరకు ఇతరుల మాటలను వినవద్దు. కొన్ని రంగాల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆశించిన ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పరీక్షలో పాల్గొనట్లయితే విజయం సాధిస్తారు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : బంధువులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నిరుద్యోగులకు ఆదాయం వచ్చే మార్గం ఏర్పడుతుంది. భవిష్యత్తు కోసం ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఓ సమస్య నుంచి బయటపడతారు. కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.