https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు కోసం టైమ్ వేస్ట్ చేసుకొని చివరికి నటుడుగా మారిన స్టార్ డైరెక్టర్…ఇంతకీ ఆయన ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 07:50 AM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఇక మీదట నుంచి వాళ్ళు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ని కైవసం చేసుకున్న సందర్భంలో మన హీరోలు కూడా మంచి సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది…

    ఒకప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి చాలా మంది తమిళ్ దర్శకులు ఎదురు చూస్తూ ఉండేవారు. ముఖ్యంగా వాళ్లు రాసుకున్న కథలను అతనికి వినిపించడమే కాకుండా ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే భారీ సక్సెస్ ని సాధించవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆయనకు కొన్ని కథలను వినిపించిన దర్శకులు కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు ఎస్ జె సూర్య, మురుగదాస్ లాంటి దర్శకులను మినహాయిస్తే మరే తమిళ్ డైరెక్టర్ తో కూడా ఆయన సినిమాలు చేయలేదు. ఇక ఈ క్రమంలోనే ‘గౌతమ్ వాసుదేవ్ మీనన్’ మహేష్ బాబుతో ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఒక మంచి కథ చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని సందర్భాల వల్ల ఆ సినిమా అనేది డిలే అవుతూ వచ్చింది. దానివల్ల వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది సెట్ అవ్వలేదు. ఇక ఆయన మహేష్ బాబు కోసం దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వెయిట్ చేశాడు.

    అయినా కూడా ఆ ప్రాజెక్టు అయితే పట్టాలెక్కలేదు. మరి ఏది ఏమైనా కూడా గౌతమ్ మీనన్ మాఫీయా గానీ, గ్యాంగ్ స్టర్ సినిమాలను తెరకెక్కించడం లో మంచి నైపుణ్యం కలిగిన దర్శకుడు. మరి ఆయన డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా చేసి ఉంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే క్రియేట్ అయ్యేది. కానీ ఆయన చేయకపోవడం వల్ల అటు గౌతమ్ మీనన్ కి, ఇటు మహేష్ బాబుకి ఇద్దరికి భారీగా నష్టం వాటిల్లిందనే చెప్పాలి…

    ఇక ప్రస్తుతం గౌతమ్ మీనన్ కొన్ని సినిమాల్లో యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం అనేది అసంభవం అనే చెప్పాలి. ఒకవేళ ఫ్యూచర్లో వచ్చిన కూడా అది ప్రేక్షకుల అంచనాలను అందుకునే మేరకు ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గౌతమ్ మీనన్ రీసెంట్ టైమ్ లో చేసిన సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కాబట్టి ఆయన డైరెక్షన్ మీద కంటే యాక్టింగ్ మీదనే ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడడానికి చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వర్క్ అవుట్ అయితే మాత్రం అది చాలా పెద్ద ప్రాజెక్టు అవుతుందనే చెప్పాలి… ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…