Mahesh Babu and Rajamouli : ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మన హీరోలు భారీ విజయాలను సాధించడంలో ముందు వరుసలో ఉన్నారు. ఇక ఎప్పటికే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబు తో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుందనే చెప్పాలి… ఇక ఇలాంటి సందర్భంలోనే చాలా మంది టాప్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక మహేష్ బాబు లాంటి నటుడు ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే జనవరి 2వ తేదీన ఈ సినిమా కి సంభందించిన పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి మేకర్స్ సన్నహాలైతే చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వినిపించాయి. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రాజమౌళి ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి జనవరి రెండోవ తేదీన అంటే ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తానని ఎక్కడ కూడా ఆఫీషియల్ గా తెలియజేయలేదు.
కానీ సోషల్ మీడియాలో వెలువడుతున్న కథనం ప్రకారం అయితే ఈ సినిమాని రెండోవ తేదీన పూజా కార్యక్రమాలు నిర్వహించి ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉన్నప్పటికి మీడియా కవరేజ్ అయితే ఉండదనే చెప్పాలి. ఇక దాంతో పాటుగా ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి తన స్టోరీని కూడా రివీల్ చేసే అవకాశాలైతే లేనట్టుగా కనిపిస్తున్నాయి…
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు మాత్రం ఎప్పుడూ తన సినిమాలకి ముహూర్తం రోజున తను హాజరవ్వడు. తన భార్య అయిన నమ్రత శిరోడ్కర్ అలాగే తన పిల్లల్ని పంపిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు మాత్రం రాజమౌళితో చేస్తున్న సినిమా కోసం తప్పకుండా ఆయన సినిమా ముహూర్తానికి హాజరవ్వాల్సిన అవసరమైతే ఉంది అన్నట్టుగా కొంతమంది సినిమా మేధావులు తెలియజేస్తున్నారు.
మరి ఎప్పుడు ఫాలో అయ్యే సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఇప్పుడు మహేష్ ముహూర్తానికి వస్తాడా? లేదంటే ఎప్పటిలాగానే తన భార్య పిల్లల్ని ముహూర్తానికి పంపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా భారీ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఇన్ని రోజులపాటు తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది…