quarrels And Unrest At Home: హిందూ పురాణాల ప్రకారం కొన్ని పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల దేవుళ్ల ఆశీస్సులను వెంటనే పొందవచ్చు అని కొందరు పండితులు తెలుపుతున్నారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అలాంటి ప్రత్యేకత కలిగిన రోజు మార్గశిర పౌర్ణమి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమి ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా కొలవడం వల్ల అనుకున్న పనులను వెంటనే పూర్తి చేయగలుగుతారు. 2025 డిసెంబర్లో నాలుగవ తేదీన మార్గశిర పౌర్ణమి రాబోతుంది. ఈరోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను తెలుసుకుందాం.
డిసెంబర్ 4వ తేదీన మార్గశిర పౌర్ణమి మాత్రమే కాకుండా.. ఇదే రోజు దత్తాత్రేయ జయంతి, భైరవి జయంతి, అన్నపూర్ణాదేవి జయంతి కూడా రాబోతోంది. ఈ దేవతామూర్తుల కలయికతో ఆకాశంలో ఒక మహాశక్తి ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజును ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అయితే సాధారణంగా మార్గశిర పౌర్ణమి రోజున చేసే పనుల కన్నా ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేయడం వల్ల జీవితంలో అనుకున్న పనులు చేయగలుగుతారని అంటున్నారు.
మార్గశిర పౌర్ణమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈరోజు శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. అందువల్ల మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కొలవడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. డిసెంబర్ 4వ తేదీన మార్గశిర పౌర్ణమి ఉదయం 8.47 నిమిషాలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5న ఉదయం 4.43 గంటలకు ముగుస్తుంది. అందువల్ల డిసెంబర్ 4వ తేదీనే లక్ష్మీదేవిని పూజించడం సమచితం అని పండితులు తెలుపుతున్నారు. సాధారణంగా వచ్చే పౌర్ణమి కంటే మార్గశిర పౌర్ణమి ఎంతో రెట్టింపు ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు 16 దశలలో కనిపిస్తాడని.. ఈ సమయంలో చంద్రుని చూస్తూ నీటిని తాగుతూ పూజలు చేయడం వల్ల శక్తి, శ్రేయస్సు లభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కుటుంబంలో అశాంతి, భూ తగాదాలు వంటి సమస్యలు ఉన్నవారు ఈ రోజున ఈశాన్యం లేదా తూర్పు దిశలో తులసి మొక్కను నాటుకోవాలి. ఈ రోజున తులసి మొక్కను నాటిన వారికి ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సమస్యలు లేదా కార్యాలయాల్లో సమస్యలు ఉన్నవారు తులసి కొమ్మను పసుపు వస్త్రంలో కట్టి దుకాణం లేదా కార్యాలయం లేదా రహస్య ప్రదేశాల్లో ఉంచడం వల్ల ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజున 11 తులసి ఆకులను వెరైటీ వస్త్రంలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈరోజు ఉపవాసం ఉండేవారు శుచి శుభ్రతతో మెలగాలి. ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా శ్రీ మహా విష్ణువును కొలుస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల వారి జీవితం సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది.