Today 4 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం ఏర్పడి అధిక లాభాలను పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. దేశంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. అన్ని శుభ ఘడియలు ఉండడంతో వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సొంత వాహనాలపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. దీంతో వ్యాపార విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): మీ రాశి వారు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన వస్తువులు అందుతాయి. నెగిటివ్ శుభవార్తలు వింటారు. విద్యార్థులు భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాను పొందుతారు. ఈరోజు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో అధిక లాభాలు పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉండడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగ శుభవార్తలు వింటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. అయితే డబ్బు వ్యవహారం జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెద్దల సూచనలను పాటించాలి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తోటి వారి మద్దతు ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు చేసే పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు శత్రువుల బెడద నుంచి పరిష్కారం లభిస్తుంది. కొన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అదృష్టవెంటే ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సంపాద పెరిగే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు అర్హులమైన వాతావరణం ఉండడంతో ఆదాయం పెరుగుతుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవసరపు వివాదాల్లోకి తలదించకుండా ఉండాలి.