Eid Mubarak Wishes: ఈద్‌–ఇ–మిలాద్‌–ఉన్‌–నబీ 2024: ప్రియమైన వారితో పంచుకోవడానికి సందేశాలు ఇవీ..

ముస్లింల ఆరాధ్య దైవం మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజును ఈద్‌ – ఇ – మిలాద్‌ – ఉన్‌ – నబీ గా జరుపుకుంటారు. ప్రేమ, సమానత్వ సందేశాలతో క్రీస్తు పూర్వం 570 ఏళ్ల క్రితం మహ్మద్‌ ప్రవక్త జన్మిచారు. నేటికీ ఆయన మిలయన్ల మందికి స్ఫూర్తి.

Written By: Raj Shekar, Updated On : September 16, 2024 1:04 pm

Eid Mubarak Wishes

Follow us on

Eid Mubarak Wishes: మహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని ఈద్‌–ఎ–మిలాద్‌–ఉన్‌–నబీ, మౌలిద్‌ అని కూడా పిలుస్తారు. ముస్లింలు జరుపుకునే ముఖ్యమై పండుగల్లో ఇదీ ఒకటి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 16న మిలాద్‌ ఉన నబీ పండుగను ముస్లింలు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈ రోజు పూర్తిగా ఆధ్యాత్మిక చింనలో ఉంటారు. ఎందుకంటే.. మహమ్మద్‌ ప్రవక్త మరణించింది కూడా ఇదే రోజు. జననం, మరణం ఒకే రోజు కావడం, ఆయన సందేశాలు కోట్లాది మందికి స్ఫూర్తినివ్వడంతో ఆయన మార్గాన్ని అనుసరిస్తున్న ముస్లింలు మిలాద్‌ – ఉన్‌ – నబీని ఆధ్యాత్మిక కార్యక్రమంగా జరుపుకుంటారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో మూడవ నెల అయిన రబీ అల్‌–అవ్వల్‌ యొక్క 12వ రోజున, ఈద్‌–ఇ–మిలాద్‌–ఉన్‌–నబీ కరుణ, న్యాయం, దయపై ప్రవక్త మార్గదర్శకత్వంపై ప్రతిబింబించే సమయంగా పనిచేస్తుంది. మిలాద్‌ ఉన్‌ – నబీ సందర్భంగా ముస్లింలు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నారు.

ప్రవక్తను మూర్తీభవించే సందేశాలు..
మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ప్రవక్త మూర్తీభవించిన విలువలను నొక్కి చెబుతూ హృదయపూర్వక సందేశాలు, శుభాకాంక్షలు పంచుకుంటున్నారు. మహమ్మద్‌ ప్రవక్త స్ఫూర్తిని నింపే కొన్ని సందేశాలు ఇవీ..

– ప్రవక్త ముహమ్మద్‌ ఆశీస్సులు మీ జీవితంలో శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావాలి.

– శాంతి, ఆప్యాయతతో నిండిన సంతోషకరమైన ఈద్‌–ఎ–మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు.

– ప్రవక్త యొక్క జ్ఞానం మిమ్మల్ని ఆనందం, విజయం వైపు నడిపిస్తుంది.
శాంతి మరియు ఆనందం మీ హృదయాన్ని మరియు ఇంటిని నింపండి.

– ప్రవక్త బోధనల వెలుగు మీ దయ మరియు నెరవేర్పు వైపు ప్రకాశవంతం చేస్తుంది.
ఈ పవిత్రమైన రోజున మీ ప్రార్థనలు శాంతి మరియు శ్రేయస్సుతో నెరవేరాలని కోరుకుంటున్నాను.

– దయ, సానుభూతితో నడిపించడానికి ప్రవక్త జీవితం మీకు స్ఫూర్తినిస్తుంది.
కృతజ్ఞతా క్షణాలతో నిండిన ప్రశాంతమైన మరియు ప్రతిబింబించే ఈద్‌–ఇ–మిలాద్‌–ఉన్‌–నబీని కోరుకుంటున్నాను.

బ్యాంకులకు సెలవులు..
ఈద్‌–ఈ–మిలాద్‌–ఉన్‌–నబీ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు సెప్టెంబర్‌ 16, సోమవారం మూసి ఉన్నాయి. గుజరాత్, మిజోరం, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, జమ్మూ, కేరళ, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో ఈద్‌–మిలాద్‌ కోసం బ్యాంకులు మూసివేయబడ్డాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన సెప్టెంబర్‌ 16, 2024న ప్రభుత్వ సెలవుదినం రద్దు చేసింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్, 1881లోని సెక్షన్‌ 25 ప్రకారం సెప్టెంబర్‌ 18, 2024ని పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించింది.