Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సోలోగా వచ్చి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఆయన తనయుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రి కి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా వచ్చిన ‘చిరుత ‘ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ అయితే అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ తను ఏదైతే అనుకున్నాడో ఈ సినిమాలో రామ్ చరణ్ ను అలాగే చూపించాడు. ఇక దాంతో పాటుగా రామ్ చరణ్ కి ఒక మంచి సక్సెస్ ని కూడా అందించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందడమే కాకుండా తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న వరుస సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాబట్టి ఆయనకు పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక ఇదిలా ఉంటే చిరుత సినిమా కోసం రామ్ చరణ్ తన మొదటి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని చిరంజీవి పూరి జగన్నాథ్ తో మాట్లాడి సెట్ చేసి మొత్తానికైతే సెట్స్ మీదకి తీసుకొచ్చాడు. ఇక ఈ క్రమంలోనే చిరంజీవి చరణ్ రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడిన విషయం అప్పట్లో వార్తల్లో నిలిచింది.
మరి మొత్తానికైతే మొదటి సినిమా కోసం మన రామ్ చరణ్ కి పెద్దగా రెమ్యూనరేషన్ అయితే ఏమీ ఇవ్వలేదట. ఇక అశ్విని దత్ అంటే చిరంజీవికి చాలా సన్నిహితుడు. కాబట్టి ఆయన రామ్ చరణ్ దగ్గరికి వచ్చి నీకు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని అడిగినప్పుడు రామ్ చరణ్ నవ్వుతూ సమాధానం ఏమి చెప్పలేదట.
దాంతో ఎంత ఇవ్వాలో తెలియక అశ్విని దత్ చిరంజీవి ని అడిగితే అప్పుడు చిరంజీవి కూడా నవ్వుతూ ఎంతో కొత్త ఇవ్వండి అని చెప్పాడట..ఇక చరణ్ తన మొదటి రెమ్యూనరేషన్ గా 50 లక్షల రూపాయలను తీసుకున్నట్టుగా కూడా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనేది క్లారిటీ గా తెలియదు. కానీ అంచనా ప్రకారమైతే 50 లక్షల వరకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ ను అందుకొని రెండోవ సినిమాగా మగధీర సినిమాను చేసి 100 కోట్ల వరకు కలెక్షన్స్ ను రావట్టడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాడు. ఇక మొత్తానికైతే తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తనలోని నటన ప్రతిభను కూడా బయటికి తీసినట్టుగా తెలుస్తుంది…