https://oktelugu.com/

Zodiac Signs : శుక్ర గ్రహం మార్పు వల్ల ఈ రాశుల వారు కొత్త ఇల్లు కొంటారు..

ధనస్సు రాశి వారికి శుక్రుడి వల్ల ధన సంపద పెరుగుతుంది. ఉద్యోగులు సీనియర్లతో సంతోషంగా ఉంటారు. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎలాంటి వివాదం ఉన్నా పరిస్కారం అవుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 12, 2024 / 12:48 PM IST

    Astrological Transit

    Follow us on

    Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ప్రతీ నెలలో తన స్థానాన్ని మార్చుకుంటాడు. శుక్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి వారి జీవితం మారిపోతుంది. ఆనందంతో పాటు డబ్బును ఇచ్చే శుక్రుడు ఉన్న రావి వారికి అనుకోని అదృష్టం వరించనుంది. అనుకోని విజయాలు ఉంటాయి. ప్రస్తుతం శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కారణంగా కొన్ని రాశుల్లో మార్పులు ఉండనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    శుక్రుడు మే నెలలో వృషభ రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈకారణంగా మీన రాశి వారి జీవితం అనూహ్యంగా మారిపోతుంది. ఈ దీంతో ఈ రాశి వారికి అనుకోని ధనం వచ్చి చేకూరుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పాత సమస్యలు తొలగిపోతాయి.

    శుక్రుడు వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల కుంభ రాశి వారి జీవితం మారిపోనుంది. ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది.

    మకర రాశి వారి జీవితంలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంతో వీరు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి.

    ధనస్సు రాశి వారికి శుక్రుడి వల్ల ధన సంపద పెరుగుతుంది. ఉద్యోగులు సీనియర్లతో సంతోషంగా ఉంటారు. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎలాంటి వివాదం ఉన్నా పరిష్కారం అవుతుంది. విద్యార్థుల కెరీర్ సక్సెస్ అవుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రమోషన్ పొందుతారు.