https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు రవి యోగం కారణంగా.. ఈ రాశి వ్యాపారులకు అధిక లాభాలు..

కుటుంబ పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 14, 2024 / 08:03 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.

    మేష రాశి:
    కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. వ్యాపారులు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఉద్యోగులు ఉల్లాసమైన వాతావరణంలో ఉంటారు. బంధువులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.

    వృషభ రాశి:
    ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. పెండింగ్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మహిళలను సంతోష పెట్టడానికి వివిధ మార్గాలు ఏర్పడుతాయి. అనారోగ్యం సమస్యలు వెంటాడుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి:
    భవిష్యత్ పెట్టుబుడుల కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. కొపాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని పనులు పూర్తి చేయడంలో గందరగోళం ఏర్పడుతుంది.

    కర్కాటక రాశి:
    కుటుంబ పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    సింహారాశి:
    వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. పాత స్నేహితులను కలుస్తారు. కొన్ని విచారకరమైన వార్తలు వింటారు. కొంచెం కష్టపడడం వల్ల పనులు పూర్తి చేసుకోవచ్చు. బంధువుల నుంచి సాయం అందుతుంది.

    కన్య రాశి:
    శారీరకంగా అలసి పోతారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవడంతో నిరాశతో ఉంటారు. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ పనుల కోసం డబ్బులు ఖర్చు అవుతుంది.

    తుల రాశి:
    వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. సీనియర్లతో ఉద్యోగులు సత్సంబంధాలు మెయింటేన్ చేయాలి.

    వృశ్చిక రాశి:
    ఏ పని చేసినా ఏకాగ్రతతో ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. వ్యాపారంలో వృద్ధి కోసం కొత్త పెట్టుబడులు పెడుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది.

    ధనస్సు రాశి:
    ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారుల మధ్య పోటీ ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తాయి. పాత పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు.

    మకర రాశి:
    ఉద్యోగుల కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. కొన్ని విషయాల్లో భావోద్వేగానికి గురవుతారు. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

    కుంభరాశి:
    మానసికంగా ఒత్తిడితో ఉంటారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలి.

    మీనరాశి:
    వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. మహిళలుకు ప్రోత్సాహకాలు ఉంటాయి.