https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : షాకింగ్ ట్విస్ట్..ఈ వారం డబుల్ ఎలిమినేషన్..డేంజర్ జోన్ లో ఊహించని స్ట్రాంగ్ కంటెస్టెంట్!

ఈ బిగ్గెస్ట్ రియాలిటీ అప్పుడే రెండవ వారం కూడా పూర్తి చేసుకుంది. ఎల్లుండి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లోని ఎలిమినేషన్ తో హౌస్ లో కంటెస్టెంట్స్ సంఖ్య ఇంకా తగ్గనుంది. 6 వారాల తర్వాత ఉండాల్సిన కంటెస్టెంట్స్ సంఖ్య, కేవలం రెండవ వారం లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

Written By:
  • Vicky
  • , Updated On : September 14, 2024 / 08:10 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ మొత్తం అన్ లిమిటెడ్ ట్విస్ట్స్ తో ఉంటుందని, ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఒక రేంజ్ లో ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గత సీజన్ పెద్ద హిట్ అవ్వడం, ఈ సీజన్ కి సంబంధించి ఇలాంటి ఆసక్తికరమైన ప్రొమోషన్స్ చేయడంతో మొదటి ఎపిసోడ్ కి రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. బిగ్ బాస్ హిస్టరీ లోనే లాంచ్ ఎపిసోడ్ కి 19 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినట్టు చరిత్ర లో లేదు. ఈ సీజన్ లాంచ్ ఎపిసోడ్ కి వచ్చాయి. నిన్న గాక మొన్ననే ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ అప్పుడే రెండవ వారం కూడా పూర్తి చేసుకుంది. ఎల్లుండి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లోని ఎలిమినేషన్ తో హౌస్ లో కంటెస్టెంట్స్ సంఖ్య ఇంకా తగ్గనుంది. 6 వారాల తర్వాత ఉండాల్సిన కంటెస్టెంట్స్ సంఖ్య, కేవలం రెండవ వారం లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

    ఈ వారం ఆడియన్స్ కి కంటెస్టెంట్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గత వారం లాగా ఈ వారం సింగల్ ఎలిమినేషన్ ఉండదట, డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ లైన్ ప్రకారం నిఖిల్ మొదటి స్థానం లో ఉండగా, విష్ణు ప్రియా రెండవ స్థానం లో కొనసాగుతుంది. ఇక డేంజర్ లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రస్తుతానికి శేఖర్ బాషా మరియు పృథ్వీ రాజ్ ఉన్నారు. కానీ వీళ్ళు కాకుండా ఊహించని కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు సీత. ఈమె హౌస్ లో మొదటి ఎపిసోడ్ నుండి ఎంత అద్భుతంగా ఆడుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం ఆటల్లోనే కాదు, మాట తీరులో కూడా ఈ అమ్మాయి హౌస్ లో ఉన్నవారిలో ది బెస్ట్ అని చెప్పొచ్చు.

    న్యాయం గా తనకు తప్పు అనిపిస్తే తప్పు అని ముఖం మీదనే చెప్పే తత్త్వం ఉన్న కంటెస్టెంట్ ఈమె. అలాంటి అమ్మాయి ఎలిమినేషన్ అవ్వబోతుంది అనే వార్త రాగానే సోషల్ మీడియా లో నేషన్స్ నిరాశకు గురయ్యారు. హౌస్ లో అసలు ఏ టాస్కు ఆడకుండా పెత్తనం సాగించే యష్మీ లాంటోళ్ళు ఎలిమినేట్ అవ్వాలి కానీ, ఇంత బాగా ఆడే అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం ఏమిటి, ఇది చాలా అన్యాయం అని అంటున్నారు నెటిజెన్స్. అయితే ఎలిమినేషన్ కాకుండా, ఈమెను సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశం కూడా ఉంది. ఇలా బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే అవకాశం ఉందట. వచ్చే వారం లో ఏకంగా 6 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నందున, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కి ఎక్కువ ఛాన్స్ ఉందని అంటున్నారు, చూడాలి మరి.