Red okra : సాధారణంగా బెండకాయలు పచ్చ రంగులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి అని చాలా మంది తింటుంటారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల లెక్కలు బాగా వస్తాయని చెబుతుంటారు. ఇవి మార్కెట్ లో అందుబాటు ధరలో దొరుకుతాయి. సీజన్ తో సంబంధం లేకుండా నిత్యం ఈ కూరగాయలు లభిస్తాయి. అయితే కేవలం పచ్చ బెండకాయలు మాత్రమే కాకుండా ఎర్ర బెండకాయలు కూడా ఉన్నాయి. వీటిని తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. పచ్చ కంటే ఎర్ర బెండకాయలు మార్కెట్ లో దొరకడం కొంచెం కష్టమే. వీటిని ఇంట్లోనే పండించుకోవచ్చు. వీటి విత్తనాలు కూడా మార్కెట్ లో లభిస్తాయి. మరి వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
బెండకాయలను తింటే బాగా తెలివి పెరిగి, లెక్కలు వస్తాయని అంటుంటారు. వీటిని ఎక్కువగా వేయించి తింటుంటారు. వీటితో పోలిస్తే ఎర్ర బెండకాయలో ఎక్కువగా పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో 94% పాలీఅన్‌శాచురేటెడ్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి బాడీ లోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే రక్త పోటుని నియంత్రణలో ఉంచుతుంది. రక్త హీనత ఉన్నవాళ్లు ఈ ఎర్ర బెండకాయలను తింటే సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ జీవ క్రియని అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. వీటిని వారానికి ఒకసారి అయిన తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు ఎర్ర రక్తకణాల సంఖ్యను కూడా పెంచడంలో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫోలేట్ గర్భిణీలకు చాలా మేలు చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇందులో విటమిన్లు, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల బరువు తగ్గడంతో పాటు మలబద్ధకం, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
ఎర్ర బెండకాయల్లో సోడియం తక్కువగా ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఎక్కువగా పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లతో పాటు థయామిన్, నియాసిన్, రిబోఫ్లోవిన్, విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. లభిస్తాయి. ఇవి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి ఎముకలను బలంగా కూడా మార్చుతాయి. ఇవి గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. అయితే ఇవి అంతగా దొరకవు. చాలా తక్కువ మంది వీటిని పండిస్తారు. వీటి వల్ల దిగుబడి వస్తుంది. కానీ అందరూ పండించరు. వీటిని పప్పు, రసం, కూరలు, పప్పుచారు వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరు వీటితో పకోడీలు వంటివి కూడా చేస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.