https://oktelugu.com/

Shivling: ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నారా?

ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి అనే కోరిక చాలా మందిలో ఉన్నా కూడా అనుమానం అయితే ఉంటుంది. మరి దీనికి జ్యోతిష్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 1, 2024 / 06:34 PM IST

    Do you want to keep Shivling at home

    Follow us on

    Shivling: హిందూ సంప్రదాయంలో శివలింగాన్ని ఎంతో భక్తితో పూజిస్తారు భక్తులు. ఆ పరమ శివుడు కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు కూడా. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవారం ఉపవాసం కూడా ఉంటారు. ఇక శివరాత్రి, కార్తీక మాసాలలో పరమేశ్వరునికి భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే ఇన్ని చేస్తున్నప్పుడు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటారు చాలామంది. ఇంతకీ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా అనే అనుమానాలు కూడా ఉంటాయి.

    ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి అనే కోరిక చాలా మందిలో ఉన్నా కూడా అనుమానం అయితే ఉంటుంది. మరి దీనికి జ్యోతిష్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు అంటున్నారు జ్యోతిష్యులు. కానీ శివలింగం పెద్దగా ఉండకూడదు అంటున్నారు. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించుకుంటే.. నిత్యం పూజలు మాత్రం చేయాలట. ఆ భోళా శంకరునికి పెద్ద పెద్ద పూజలు చేసుకోకున్నా.. కొన్ని నీళ్లు పోసినా ఎంతో సంతోషిస్తారు.

    బిల్వ పత్రాన్ని సమర్పిస్తే మీ కోరికలను ఇట్టే తీరుస్తాడు ఆ శంకరుడు. ఇక పరమాత్మునికి మాత్రమే కాదు ఇంట్లో పెట్టుకున్న దేవ దేవుళ్లకు రోజు పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు జ్యోతిష్యులు. కొంత మంది మాత్రం దేవుళ్లను ఇంట్లోకి తీసుకొని వచ్చి రోజు పూజలు మాత్రం చేయరు. కొందరికి సమయం ఉండదు. కొందరికి రోజు పూజలు చేయడం కుదరకపోవచ్చు.

    రోజు పూజలు చేయకపోయినా తడి గుడ్డను తీసుకొని దేవుడి పటాలను అయినా శుభ్రపరుస్తూ ఉండాలట. పెద్ద పెద్ద దేవాలయాల్లో శివలింగానికి భస్మం తో అభిషేకం చేస్తారు. కానీ మన ఇళ్లలో సాధారణ పద్ధతిలో పూజించుకుంటే సరిపోతుంది అంటున్నారు జ్యోతిష్యులు. ప్రతి రోజు అభిషేకం చేసి దేవుడిని పూజిస్తే చాలు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే జాతకంలో దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అంటున్నారు జ్యోతిష్యులు.