https://oktelugu.com/

Rashmika Mandana : బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసిన రష్మిక మందాన… పక్కలో చూస్తే షాక్!

మరోవైపు విజయ్ దేవరకొండతో ఆమెకు ఎఫైర్ ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కొన్నేళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. తాము ఫ్రెండ్స్ మాత్రమే అని కొట్టిపారేస్తున్నప్పటికీ... సంథింగ్ సంథింగ్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 1, 2024 / 06:31 PM IST

    Rashmika Mandana shared a photo with her pet dog

    Follow us on

    Rashmika Mandana : రష్మిక మందాన తన బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసింది. తన ఉదయాన్ని అందంగా మార్చేసేది ఎవరో చెప్పింది. ఇక రష్మిక పక్కలో ఉన్నది ఎవరో చూసి జనాలు షాక్ అయ్యారు. రష్మిక మందాన ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది. రష్మిక మందాన నటిగా ఫుల్ బిజీ. ఆమె చేతినిండా ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. పుష్ప 2 విడుదల దగ్గర పడుతుండగా నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.

    శ్రీవల్లిగా రష్మిక మందాన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయనుంది. అలాగే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఆమె చేస్తున్నారు. రైన్ బో టైటిల్ తో ఒక చిత్రం రూపొందుతుంది. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. కాగా గత ఏడాది యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది.

    రన్బీర్ కపూర్ కి జంటగా రష్మిక మందాన నటించిన విషయం తెలిసిందే. తొలి బాలీవుడ్ హిట్ ఈ చిత్రంతో ఖాతాలో వేసుకుంది. యానిమల్ మూవీలో రష్మిక ఒకింత ఛాలెంజింగ్ రోల్ చేసింది. ముద్దు సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించింది. ఇదిలా ఉండగా రష్మిక మందాన ఒక ప్రైవేట్ ఫోటో షేర్ చేసింది. ఉదయాన్నే బెడ్ పై పడుకుని ఉన్న ఫోటో షేర్ చేసింది. ”నా ఉదయపు సమయాలు ఆమెతో గొప్పగా ఉంటాయి” అని ఒక కోట్ రాసుకొచ్చింది.

    ఇక రష్మిక మందాన పక్కలో తన పెట్ డాగ్ ఆరా ఉంది. కొన్నాళ్లుగా రష్మిక మందాన ఓ పెట్ డాగ్ ని కలిగి ఉంది. దాని పేరు ఆరా. నిద్రలేవగానే ఆరాతో గడపడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని రష్మిక మందాన చెప్పకనే చెప్పింది. మరోవైపు విజయ్ దేవరకొండతో ఆమెకు ఎఫైర్ ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కొన్నేళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. తాము ఫ్రెండ్స్ మాత్రమే అని కొట్టిపారేస్తున్నప్పటికీ… సంథింగ్ సంథింగ్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.