https://oktelugu.com/

Birds: ఈ పక్షులు మీ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

పక్షుల వల్ల కూడా మంచి చెడులు ఉంటాయట. వీటిని ఆకస్మికంగా చూసినా లేదా ఇంట్లోకి వచ్చినా కూడా లక్ష్మీ దేవి వచ్చినట్టు నమ్ముతారట. ఇంతకీ ఆ పక్షులు ఏంటి అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ వేసేయండి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 15, 2024 / 10:44 AM IST

    What happens when these birds come to your house

    Follow us on

    Birds: జ్యోతిష్య శాస్త్రంలోని చాలా విషయాలు ప్రజలను విస్తు పరుస్తుంటాయి. వాస్తు ప్రకారం ఇల్లు, ఇంట్లో ఉండే వస్తువుల వల్ల పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి అంటారు నిపుణులు. ఇంట్లో పెంచుకునే మొక్కల వల్ల కూడా ప్రతికూల, సానుకూల వాతావరణం ఏర్పడుతుందట. అయితే పక్షుల వల్ల కూడా మంచి చెడులు ఉంటాయట. వీటిని ఆకస్మికంగా చూసినా లేదా ఇంట్లోకి వచ్చినా కూడా లక్ష్మీ దేవి వచ్చినట్టు నమ్ముతారట. ఇంతకీ ఆ పక్షులు ఏంటి అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ వేసేయండి.

    గుడ్లగూబ.. గుడ్లగూబ అనగానే అందరూ భయపడతారు. గుడ్లగూబను చూడటం కూడా కీడుగా భావిస్తారు కొందరు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం గుడ్ల గూబను ఆకస్మికంగా చూడటం చాలా శుభ్రప్రదం అంటారు. బాల్కనీ లేదా ఇంటి పైకప్పు మీద కనిపిస్తే ఇంట్లో చాలా మంచి జరగబోతుందని సంకేతమట. గుడ్లగూబను లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. మంచి మాత్రమే కాదు పెండింగ్ వర్క్ లకు కూడా ముగింపు వస్తుందట.

    తెల్లపావురం.. వాస్తు ప్రకారం తెల్ల పావురాన్ని ఇంట్లో చూస్తే ఆకస్మిక ధనలాభం జరుగుతుందట. లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదాలు కూడా ఉంటాయట. అంతేకాదు తెల్లపావురం అకస్మికంగా కనిపిస్తే అదృష్టానికి సంకేతమట. ఇంట్లో ఈ పావురాన్ని చూస్తే మీపై లక్ష్మీ దేవి ఆశీర్వాదాలు ఉన్నాయని నమ్మండి అంటున్నారు వాస్తు నిపుణులు.

    కాకి.. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు కాకి అరిచినా, కాకి అడ్డు వచ్చినా, తల కి కాకి తగిలినా కూడా కీడుగా భావిస్తారు. కానీ కాకి ఇంట్లో అకస్మాత్తుగా కనిపిస్తే చాలా ప్రయోజనకరంగా భావిస్తారు పండితులు. వాస్తవంగా అకస్మికంగా కాకిని చూడటం వల్ల ఆర్థిక లాభం వస్తుందట. ఇక ఇంటికి కాకి వస్తే అతిథి వస్తారని, వారు గౌరవప్రదమైన వ్యక్తి అని నమ్ముతారు చాలా మంది.