Kala Sarpa Dosha : జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొందరికీ జీవితాంతం కష్టాలే అన్నట్లుగా ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా అన్నీ అడ్డంకులే ఎదువుతూ ఉంటాయి. మరికొందరు ఎంత మంచిగా ప్రవర్తించినా.. అన్నీ అశుభాలే జరుగుతూ ఉంటాయి. అయితే వారి జాతకంలో ఏదో దోషం ఉండడం వల్లే ఇలా జరగుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వారి జీవితంలో కాలసర్పదోషం ఉండడం వల్లే వారు ఏ పని చేసినా పూర్తి కాదని, అన్నీ అడ్డంకులు ఎదురవుతాయని అంటుంటారు. అయితే కాల సర్ప దోషం ఉన్న వాళ్లకు కలలో ఇవి కనిపిస్తాయట. ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయంటే వారు కాలసర్పదోషంతో బాధపడుతున్నారని అర్థం. అయితే అందుకోసం పరిహారం చేయొచ్చు అని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
కొందరు ఎంత ప్రయత్నించినా జీవితంలో ఎదగలేకపోతారు. దీంతో వారికి అదృష్టం లేదని అంటారు. మరికొందరు కావాలనే ఇలా చేస్తున్నారని అంటుంటారు. కానీ వారి జీవితంలో కాలసర్పదోషం ఉండడం వల్లే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని చెబుతూ ఉంటారు. అయితే కొందరి జీవితంలో కాల సర్పదోషం ఉన్నా.. మంచే జరుగుతుంది. వారు అనుకున్న పని నెరవేతురుంది. కానీ కాల సర్ప దోషం ఉన్న వారి కలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయట.
కొందరికి పీడ కలలు వస్తాయని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వారికి కలలో పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటారు. అయితే కాల సర్పదోషం ఉన్న వారికి కలలో పాములు పాకుటున్నట్లు కనిపిస్తాయి. అలగే పాములు పైకి వస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా జంట పాములు తమపైకి దాడికి దిగుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో వారి జాతకంలో కాల సర్ప దోషం ఉన్నట్లు గుర్తించాలి.
అయితే కాల సర్పదోషానికి నివారణ ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. కాలసర్పదోషం ఉందని గుర్తించిన వారు మహా విష్ణువును ఆరాధించాలి. ప్రతిరోజూ విష్ణు సహస్ర నామాన్ని స్మరించాలి. అలాగే కాలసర్పదోషాన్ని నివారించడానికి గోమేధికం లేదా వెండితో చేసిన పాము ఆకారపు ఉంగరాన్ని ధరించాలి. అలాగే కాలసర్పదోషం తో బాధపడేవారు. శనివారం ప్రవహించే నీటిలో కొంచెం బొగ్గును చల్లాలి. ఇలా చేయడం వల్ల కాలసర్పదోష ప్రభావం తగ్గుతుంది. అలాగే పారే నీటిలో బెల్లాన్ని వేయాలి.
కాల సర్పదోషం ఉన్న వారు పరిహారం కోసం ప్రత్యేకంగా పూజలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాహు, కేతువులకు పూజలు చేయడం వల్ల దోషం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతీ శనివారం దైవనామస్మరణ చేయడం వల్ల దైవ బలం పెరుగుతుంది. దైవబలం పెరగడం వల్ల దోష నివారణకు మార్గం సుగమం అవుతుంది. అలాగే కొన్ని పనులకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. కాల సర్పదోషం పోవడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయి. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఒక్కరికి కాల సర్పదోషం ఉన్న వారితో మిగతా వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల పరిహారం కోసం ప్రయత్నించాలి.