Devara: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ కారణంగా, ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం అనకాపల్లి నుండి అమెరికా వరకు రీ సౌండ్ వచ్చే రేంజ్ లో వచ్చాయి. సాధారణంగా అర్థరాత్రి షోస్ పడిన సినిమాలకు రెగ్యులర్ షోస్ వసూళ్ళు బాగా తగ్గుతాయి. కానీ ‘దేవర’ విషయంలో అలా జరగలేదు. సుమారుగా 535 మిడ్ నైట్ షోస్ పడినప్పటికీ కూడా రెగ్యులర్ షోస్ అదరగోట్టాయి. ఈ చిత్రానికి ఇంత స్థాయి ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణం మన టాలీవుడ్ ఆడియన్స్ సరైన సినిమా కోసం ఆకలితో ఎదురు చూడడమే. ఎందుకంటే ఈ ఏడాది ‘కల్కి’ చిత్రం తప్ప మరో స్టార్ హీరో సినిమా విడుదల కాలేదు. సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం విడుదల అయ్యింది కానీ, కమర్షియల్ గా ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ తర్వాత మన టాలీవుడ్ చిన్న సినిమాల మీదనే ఆధారపడింది. అవి కమర్షియల్ గా సూపర్ హిట్స్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి. ఇలాంటి సమయం లో ఒక పెద్ద హీరో సినిమా విడుదలైతే చూడాలని ఉందని ప్రేక్షకులు సోషల్ మీడియా లో ఎన్నోసార్లు పోస్టులు పెట్టారు.
సరిగ్గా అలా కోరుకుంటున్న సమయంలోనే ‘దేవర’ చిత్రం విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది అనేది వాస్తవం, కానీ సినిమాలో డైరెక్టర్ కొరటాల శివ కొన్ని ఆసక్తికరమైన ట్విస్టులు పెట్టడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ నిరాశపర్చిన, ఎండింగ్ షాట్ లో క్యారక్టర్ ఆర్టిస్టు ప్రకాష్ రాజ్ అజయ్ తో మాట్లాడుతూ ‘దేవర గుండెల్లోకి కత్తి దించిన మగాడు ఎవడు’ అని అడగగా, దేవర కొడుకు ‘వర’ నే చంపినట్టుగా చూపిస్తాడు డైరెక్టర్ కొరటాల శివ. ‘బాహుబలి’ చిత్రం లో ‘వై కట్టప్ప కిల్స్ బాహుబలి’ లాగా ఇక్కడ ‘వై వర కిల్స్ దేవర’ అనే ట్విస్ట్ పెట్టాడు కొరటాల.
అసలు వర ఎందుకు ‘దేవర’ ని చంపాడు అనేది ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి ఎంత ఆలోచించినా అర్థం కాదు. ‘దేవర’ కారణంగా అసలు వర కి ఏమి నష్టం జరిగింది?, పోనీ దేవర ఏమైనా అసాంఘిక చర్యలు చేపడుతున్నాడు, అది నచ్చక వర చంపేశాడు అనేదానికి కూడా లేదు. ‘దేవర’ అలాంటి వాటికి పూర్తిగా వ్యతిరేకం, అలాంటి పనులు చేసేవారిని చంపుతుంటాడు. పోనీ విలన్ సైఫ్ అలీ ఖాన్ ‘వర’ కి తన తండ్రి మీద లేని పోనివి చెప్పి నమ్మించడం వల్ల వర అలా చేశాడా?, అసలు ఏమి జరిగింది అనే అంశం మీద సీక్వెల్ ఉండబోతుంది. ఈ సీక్వెల్ లో వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయట. కొరటాల మార్క్ హీరోయిజం కూడా ఉంటుందని సమాచారం.