https://oktelugu.com/

Young Heroes: స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెడుతున్న యంగ్ హీరోలు… వర్కౌట్ అవుతుందంటరా..?

ప్రజెంట్ యంగ్ హీరోలుగా కొనసాగుతున్న కొంతమంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 10, 2024 / 04:37 PM IST

    Siddhu Jonnalagadda, Vishwak Sen, Teja Sajja,

    Follow us on

    Young Heroes: సినిమా ఇండస్ట్రీ అంటే కొందరికి సరైన అభిప్రాయం అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ పక్షపాతాలు, రాజకీయాలు బాగా జరుగుతాయి. సోలోగా వచ్చే వాళ్ళని ఎదగనివ్వరు అనే ఉద్దేశ్యం తోనే ఇండస్ట్రీ ని ఎక్కువగా ఇష్టపడరు… అయితే కొంతమంది మాత్రం సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకొని స్టార్లుగా వెలుగొందుతూ ఉంటారు.

    ఇక ఇప్పుడు ప్రజెంట్ యంగ్ హీరోలుగా కొనసాగుతున్న కొంతమంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, తేజ సజ్జా లాంటి యంగ్ హీరోలు ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరోల కోసం స్టార్ డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి కొరటాల శివ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దేవర సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తాడు అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

    ఇక ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా బిజీగా ఉండడం వల్ల కొరటాల విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇంక అది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రానప్పటికీ కొరటాల విజయ్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక సిద్దు జొన్నలగడ్డ ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా తొందర్లోనే స్టార్ హీరోగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

    ఇక తేజ సజ్జా తో కూడా స్టార్ డైరెక్టర్లు సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ తేజ తో ఒక భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే యంగ్ హీరోలందరూ స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారుతున్నారు…