Fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచింది. అనేక పరిశోధనల్లో ఇది నిరూపితమైంది. అలాంటి పండ్లను మనకు ప్రకృతి సహజంగా ప్రసాదించింది. అయితే ప్రపంచమంతటికీ సరిపోయే పండు లేవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పండ్లు దొరుకుతున్నాయి. దీంతో మనిషి తన మేధస్సును, రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా సాగు చేస్తున్నాయి. అయితే ఈ పండ్లు రసాయనాలతో విషపూరితం అవుతున్నాయి. అలా కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పండ్లు తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, వాటర్, మన శరీరానికి అందిస్తాయి. అనారోగ్య సమస్యలు దూరం కావడమే కాకుండా ద్ఘీకాలిక వ్యాధులు కూడా నయమవుతాయి. ఈ నేపథ్యంలో ఏ పండులో ఏ పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం…
1. వాటర్ మిలన్
ఇందులో నీరు 92 శాతం ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఇ, ఏ ఉంటాయి. పొటాషియం ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
2. పప్పాయా
ఇందులో: విటమిన్ ఇ, విటమిన్ అ, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. జ్ఞాపక శక్తి పెంచడంలో, చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
3. దోస..
ఇందులో నీటిశాతం 96 ఉంటుంది. విటమిన్ Mకె, విటమిన్ సీ ఉంటాయి. పొటాషియం మినరల్ ఉంటుంది. కీటో డైట్‌లో భాగంగా, పొటాషియం, మైక్రో న్యూట్రియెంట్లతో సమృద్ధిగా ఉంటుంది.
4. సిట్రిస్ ఫ్రూట్స్..(ఆరంజ్, లెమన్..)
వీటిలో విటమిన్ సీ, ఏ ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం మినరల్స్ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడతాయి.
5. ఆపిల్
ఇందులో విటమిన్ సీ ఉంటుంది. మినరల్స్ పొటాషియం, కాల్షియం ఉంటాయి. హార్ట్ హెల్త్‌కు ఉపయోగకరం, పाचन వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదపడతాయి.
6. పైనాపిల్…
ఇందులో విటమిన్ సీ, ఏ ఉంటాయి. మాంగనీస్ మినరల్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, పచనానికి సహాయపడడం.
7. మామిడికాయ
ఇందులో విటమిన్ సీ, విటమిన్ ఏ ఉంటాయి. పొటాషియం, కాపర్ మినరల్స్ ఉంటాయి. కంటికి మంచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
8. స్ట్రాబెర్రీ..
వీటిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. మాంగనీస్, పొటాషియం మినలర్స్ ఉంటాయి. చర్మానికి మంచిది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
9. పొమొగ్రనేట్(దానిమ్మ)
ఇందులో విటమిన్ సీ, విటమిన్ కే అధికంగా ఉంటాయి. పొటాషియం మినరల్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
10. అవకాడో
ఇది అతి కొవ్వు ఉన్న పండు అని పరిగణించబడుతుంది. దీనిలో ఉండే కొవ్వు ఎక్కువగా ఆరోగ్యకరమైన మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్‌గా ఉంటుంది. 100 గ్రాములు అవకాడోలో సుమారు 15 గ్రాములు కొవ్వు ఉంటుంది. ఇది హృదయానికి మేలుచేస్తుంది. ఇందులో పాలియున్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కూడా కొద్దిగా ఉంటాయి.