https://oktelugu.com/

Diwali: దసరా తర్వాత 21 రోజులకు దీపావళి వస్తుందా? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. కొత్త దుస్తులు ధరించి, ఘనంగా జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ ప్రతీ ఏడాది దసరాకి కరెక్ట్‌గా 21 రోజల తర్వాత వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అసలు ప్రతీ ఏడాది ఇలా 21 రోజులకే రావడానికి కారణం ఏంటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో మరి పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 17, 2024 / 09:47 AM IST

    Diwali

    Follow us on

    Diwali: హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగ చాలా ప్రత్యేకమైనది. వినాయక చవితి మొదలు వచ్చిన ప్రతీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబమంతా కలిపి సంతోషంగా జరుపుకుంటారు. అయితే పండుగల్లో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. అలాగే పిల్లలకు నచ్చే కొన్ని పండుగలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో దీపావళి ఒకటి. పిల్లలకు దీపావళి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే టపాసులు కాల్చవచ్చని సంతోషపడతారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు చాలా భక్తితో తప్పకుండా నిర్వహిస్తాయి. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. కొత్త దుస్తులు ధరించి, ఘనంగా జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ ప్రతీ ఏడాది దసరాకి కరెక్ట్‌గా 21 రోజల తర్వాత వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అసలు ప్రతీ ఏడాది ఇలా 21 రోజులకే రావడానికి కారణం ఏంటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో మరి పూర్తిగా తెలుసుకుందాం.

     

    దసరాకి సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి పండుగ వస్తుంది. ఇది అయితే అక్షర సత్యం. సందేహమనిపిస్తే వెంటనే క్యాలెండర్ చెక్ చేసుకోవచ్చు. అయితే పురాణాలు ఏం చెబుతున్నాయంటే.. రాముడు తన సైన్యంతో కలిసి శ్రీలంక నుంచి అయోధ్యకు కాలినడకన ప్రారంభమయ్యాడు. అయోధ్యకు చేరుకోవడానికి సరిగ్గా 21 రోజులు అనగా 504 గంటలు పట్టిందని రామాయణం చెబుతోంది. అయితే ఈ 504 గంటలను 24 గంటలుగా విభజిస్తే 21 రోజులు వస్తుంది. మీకు సందేహం అనిపిస్తే ఒకసారి గూగుల్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. శ్రీలంక నుంచి అయోధ్యకు కాలినడకన వెళ్లాల్సిన దూరం 3145 కి.మీ ఉంటుంది. దీన్ని నడవానికి 504 గంటలు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే త్రేతాయుగం నుంచి దేశప్రజలంతా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. దీని గురించి రామాయణంలో కూడా వాల్మీకి మహర్షి రాశాడని పురాణాలు చెబుతున్నాయి.

     

    ఇదిలా ఉండగా రాముడు రావణుడితో యుద్ధం చేసిన తర్వాత శ్రీలంక నుంచి రాముడు బయలు దేరతాడు. అప్పుడు విభీషణుడు పుష్పక విమానంలో తీసుకెళ్తాడు. అయితే మధ్యలో పుష్పక విమానం వానరుల భార్యలను కూడా రాముని పట్టాభిషేకానికి తీసుకెళ్తారు. అయితే రావణుడిని ఓడించిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ప్రజలంతా సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలంతా ఘనంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి రోజు చాలా ప్రాంతాల్లో రావణుడు దిష్టి బొమ్మను కూడా దహనం చేస్తారని చెబుతుంటారు. మరి మీరు దీపావళి పండుగను ఈ ఏడాది ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉండే పండితులను సంప్రదించడం ఉత్తమం.