https://oktelugu.com/

Diwali 2024 : దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి?

హిందువులు జరుపుకునే పండుగల్లో దీపావళి కూడా ఒకటి. భక్తిశ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకోవడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే చాలా మందికి దీపావళి పండుగ ప్రాముఖ్యత గురించి సరిగ్గా తెలియదు. మరి ఈ దీపావళి పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 26, 2024 / 12:33 PM IST

    Diwali

    Follow us on

    Diwali 2024 : హిందువులు జరుపుకునే పండుగల్లో దీపావళి కూడా ఒకటి. భక్తిశ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకోవడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఘనంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. కార్తీక మాసంలో అమావాస్య తిథి నాడు ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు. అందరికి దీపావళి అంటే చాలా ఇష్టం. ఈ ఏడాది దీపావళి పండుగ రెండు రోజులు వచ్చింది. కొందరు అక్టోబర్ 31న జరుపుకుంటే.. మరికొందరు నవంబర్ 1న జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా అందరూ కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. లక్ష్మీదేవిని ఈ రోజు పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే చాలా మందికి దీపావళి పండుగ ప్రాముఖ్యత గురించి సరిగ్గా తెలియదు. మరి ఈ దీపావళి పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

     

    దక్షిణ భారత దేశంలో కంటే ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. విజయానికి గుర్తుగా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే రాముడు రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లి గెలిచి అయోధ్యకు రావడం వల్ల దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీకృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడుని చంపినందుకు దీపావళిని జరుపుకుంటారని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి. నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను హింసించేవాడు. తన ఆకలి కోసం రోజుకొక మనిషిని తినేవాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు.. సత్యభామతో కలిసి ఆ రాక్షసుడుని హరిస్తాడు. ఇలా చెడుపై విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అలాగే శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి వివాహం చేసుకోవడం వల్ల దీపావళి పండుగను జరుపుకుంటారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి పండుగ రోజు చాలా గ్రామాల్లో నరకాసురుడి దిష్టి బొమ్మను దహనం చేస్తారు.

     

    దీపావళి పండుగను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ జరుపుకుంటారు. అయితే ఈ పండుగను సాయంత్రం పూట చేస్తారు. కానీ తెల్లవారు జామున లేచి కాల కృత్యాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని కొత్త దుస్తులు ధరించాలి. ఇంట్లో దీపం వెలిగించి సాయంత్రం పూజకి కావాల్సిన వంటలు తయారు చేయాలి. ఎక్కువ మంది దీపావళి పండుగ రోజు లక్ష్మీ దేవికి ఇష్టమైన తీపి వంటకాలు చేస్తుంటారు. సాయంత్రం పిండి వంటలు, స్వీట్లుతో లక్ష్మీదేవిని పూజిస్తే తల్లి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అయితే దీపావళి పండుగ రోజున కొన్ని నియమాలు పాటిస్తూ పూజ చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ నియమాలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.